సాక్షి, చెన్నై: తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను డీఎంకే అధినేత స్టాలిన్ కొట్టిపారేశారు. ఏడో విడత ఎన్నికలు ముగియడంతో ఆదివారం సాయంత్రం పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మబోమని, మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచిచూస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఫలితాల అనంతరం ఆయన ఏ కూటమితో జట్టు కడుతారనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కేంద్రంలో అతిపెద్ద పార్టీకి మద్దతిచ్చే అంశంపై స్టాలిన్ ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేశారు.
కేంద్రంలో ఏ కూటమితో జట్టు కడుతారన్న అంశంపైనా స్పందించలేదు. ఫలితాలు వెలువడేవరకు వేచిచూస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబుతో టచ్‌లోనే ఉన్నట్టు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మరోవైపు అధికార అన్నాడీఎంకే కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చింది. ఎన్నికల్లో తమ పార్టీ బాగా పనిచేసిందని, మంచి ఫలితాలు వస్తాయని తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మబోము
Comments
Please login to add a commentAdd a comment