తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను డీఎంకే అధినేత స్టాలిన్ కొట్టిపారేశారు. ఏడో విడత ఎన్నికలు ముగియడంతో ఆదివారం సాయంత్రం పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మబోమని, మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచిచూస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఫలితాల అనంతరం ఆయన ఏ కూటమితో జట్టు కడుతారనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.