కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో హస్తినలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో నేడు ఢిల్లీలో జరగాల్సిన భేటిని బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు. మాయావతి ఈరోజు ఢిల్లీకి రావడం లేదని, లక్నోలోనే ఉంటారని బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా తెలిపారు.