ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతికిఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ ఎన్నికల ప్రచారం నుంచి కొంత సమయం పాటు బ్యాన్ చేసింది. మతపరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం యోగిని మూడు రోజులు (72 గంటల పాటు), మాయావతిని రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారంనుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.
మాయావతికు, యోగి ఆదిత్యనాథ్‌కు ఈసీ ఝలక్
Published Mon, Apr 15 2019 4:23 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement