
బెంగాల్‌లో వికసించిన కమలం
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో బీజేపీ దీటుగా తలపడింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తృణమూల్ ఆధిపత్యానికి గండికొడుతూ బెంగాల్‌లో కమలదళం 11 స్ధానాలు గెలుచుకోనుంది. 2014లో బెంగాల్‌లో బీజేపీ కేవలం రెండు స్ధానాల్లో గెలుపొందడం గమనార్హం.
ఇక గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటింగ్ శాతం 17 నుంచి ఏకంగా 32 శాతానికి ఎగబాకనుంది. ఇక సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కేవలం ఒక స్ధానానికే పరిమితం కానుంది. కాగా, బెంగాల్‌లో బీజేపీకి 10 నుంచి 19 సీట్లు రావచ్చని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.