
శైలజ చరణ్ రెడ్డి ,లగడపాటి రాజగోపాల్
లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్ సర్వే అని శైలజ చరణ్ రెడ్డి ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్ సర్వే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఆంధ్ర బెట్టింగ్ బుకీలతో డీల్ కుదుర్చుకొని బోగస్ సర్వేను ఆయుధంగా విడుదల చేశాడని దుయ్యబట్టారు. లగడపాటి సర్వేలను తెలుగు ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని, ఆయన సర్వేలకు కాలం చెల్లిందన్నారు. లగడపాటి సర్వే అంటేనే బెట్టింగ్‌ల కోసమే అనేది అందరికీ తెలిసిన రహస్యమే అన్నారు. తెలంగాణలోమహా కుటమి గెలుస్తుందని ప్రకటించి బోల్తా పడ్డాడని, ఇప్పుడు అదే తప్పిదాన్ని పునరావృతం చేస్తున్నాడన్నారు. బెట్టింగ్‌లను ప్రోత్సహించేలా బోగస్ సర్వే విడుదల చేసిన లగడపాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు.
బాబు ప్రాపకం కోసమే..
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): తన రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారడంతో లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యం చెప్పుకుంటూ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బెట్టింగ్ రాయుళ్లను తప్పుదోవ పట్టించి రూ.కోట్లు దోచుకోవడంలో భాగంగానే చంద్రబాబు అండ్ కో లగడపాటిని అడ్డుపెట్టుకుని సర్వే నాటకాలు ఆడిస్తున్నారని ఆరోపించారు.