lagadapati survey
-
‘అది దొంగ సర్వే’
సాక్షి, తిరుమల : ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(గురువారం) ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే దొంగ సర్వేనని, ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. లగడపాటి సర్వేను ప్రజలు నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్ జగన్ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
కాయ్.. రాజా కాయ్!
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్‌పోల్స్ వెలువడేసరికి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘంగా జరిగిన ఎన్నికలు కావడంతో ఇంతకాలం పందెం రాయుళ్లు స్తబ్దుగా ఉన్నారు. కానీ, ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడటంతో పందేలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు పలు తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ జోరుగా పందేలు సాగుతున్నాయి. పలు స్థానాలపై ఇప్పటికే పార్టీల బలాలవారీగా స్పష్టత వచ్చింది. దీంతో ఇక మెజారిటీ ఎంత వస్తుంది.. అన్న అంశాలపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఆరు స్థానాలపై ఉత్కంఠ.. ఇక తెలంగాణలో ఆరు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు వస్తా యని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ప్రతిపక్షాలకు ఒక ట్రెండు సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యం లో భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, మల్కాజిగిరి స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మూడు పార్టీలు నువ్వానేనా అన్న తరహాలో సర్వశక్తులూ ఒడ్డాయి. ఆయాస్థానాల్లో అన్ని పార్టీలు విజయంపై ధీమాగా ఉండటం విశేషం. దీంతో ఈ స్థానాలపై పందేలు కాసేందుకు పందెంరాయుళ్లు అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? ఎంత మెజారిటీ వస్తుంది? అన్న విషయాలపై బెట్టింగులు సాగుతున్నాయి. రూ.1000 నుంచి రూ.లక్షల్లో ఈ బెట్టింగులు సాగడం విశేషం. ప్రభావం చూపని లగడపాటి.. గత తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్–తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తన సర్వేను ప్రకటించాడు. అదేసమయంలో జాతీయ సర్వేలన్నీ రాజగోపాల్ సర్వేకు విరుద్ధంగా ఉన్నా సరే.. మెజారిటీ ప్రజలు, పందెం రాయుళ్లు రాజగోపాల్ సర్వేకే మొగ్గుచూపారు. అదే నమ్మకంతో కోట్ల రూపాయల్లో కూటమి గెలుస్తుందంటూ రెండు రాష్ట్రాల ప్రజలు జోరుగా పందేలు కాశారు. అయితే టీఆర్ఎస్ 88 స్థానాలు గెలవడం, కాంగ్రెస్ కూటమి కేవలం 21 స్థానాలకు పరిమితమవడంతో కథ అడ్డం తిరిగింది. కూటమి గెలుస్తుందంటూ రూ.వందల కోట్లలో పందేలు కాసిన వారు ఘోరంగా ఓడిపోయి.. మొత్తం డబ్బును పోగొట్టుకున్నారు. ఈసారి కూడా అదేరీతిలో లగడపాటి సర్వే ఉండటంతో బెట్టింగుబాబులు లగడపాటి సర్వేను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. టీఆర్ఎస్, వైసీపీ వైపే.. అన్ని సర్వేలు తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ విజయాన్ని ఖరారు చేయడంతో బెట్టింగుబాబులంతా ఈ రెండు పార్టీలవైపే చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల విజయావకాశాలపై హైదరాబాద్‌లోనూ పంటర్లు పందేలు జోరుగా కాస్తున్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ ఎంత మెజారిటీ సాధిస్తుంది? అన్న విషయాల్లో పందేలు నడుస్తున్నాయి. -
బాబు కోసం బోగస్ సర్వేలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రధాన సర్వే సంస్థలు, జాతీయ మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో తమ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పలు బోగస్ సర్వే సంస్థలను రంగంలోకి దించింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వస్తుందని పేరెన్నికగన్న సంస్థలన్నీ చెబుతుండగా, బోగస్ సంస్థలు మాత్రం మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని హడావుడి చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో టీడీపీ నేతల అభిప్రాయమే వినిపించింది. ఐఎన్ఎస్ఎస్, ఎలైట్ పేరుతో మరికొన్ని సర్వేలు అదే కోవలో బయటకు వచ్చాయి. ఇవన్నీ టీడీపీ పెద్దల కనుసన్నల్లో పని చేసేవేనని చెబుతున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడవుతుందని ముందే తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము గెలుస్తున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయని చూపించుకునేందుకు బోగస్ సంస్థలను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ సంస్థలు అసలు సర్వేలు చేయకుండానే చేసినట్లు బిల్డప్ ఇచ్చి, నోటికొచ్చిన సీట్ల లెక్కలు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. లగడపాటి సర్వే తీరిది.. రెండురోజుల నుంచి హంగామా చేస్తున్న లగడపాటి సర్వే పూర్తిగా బోగస్ అని సెఫాలజిస్టులు తేల్చిచెబుతున్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి చెబుతున్నా, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ సంస్థను నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించగా, ఆయనతోనే తాను సర్వే చేయించినట్లు లగడపాటి చెబుతుండడం గమనార్హం. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో చేసిన సర్వే వివరాలతో లగడపాటి ఒక నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను కేవలం 38 నియోజకవర్గాల్లోనే తాము సర్వే చేశామని, 50 వేల శాంపిల్స్ తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అది కూడా మూడు జిల్లాల్లోనే ఈ సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు. కేవలం 38 నియోజకవర్గాల్లో సర్వే చేసి, ఫలితాలను అంచనా వేయడం ఎక్కడా జరగదని సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు. అందులోనూ లగడపాటి టీడీపీకి 90కి 20 స్థానాలు అటూ ఇటుగా వస్తాయని చెప్పడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 20 సీట్ల మార్జిన్‌తో ఫలితాలు అంచనా వేయడాన్ని బట్టి వారి సర్వేపై వారికే నమ్మకం లేదని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. చంద్రబాబుతో తెరచాటు సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన లగడపాటి సర్వేకు ఏమాత్రం ప్రామాణికత లేదని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, లగడపాటి మాత్రం మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆ రెండు సంస్థలూ అంతే.. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ఎస్ సంస్థ పేరుతో విడుదలైన సర్వే కూడా టీడీపీ నాయకుల మెదళ్ల నుంచి బయటకు వచ్చిందే. ఐఎన్ఎస్ఎస్ అనేది ప్రాభవం కోల్పోయిన ఒక తెలుగు దినపత్రికలో పనిచేసిన జర్నలిస్టు ఢిల్లీలో నిర్వహిస్తున్న న్యూస్ ఏజెన్సీ. ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను కవర్ చేయడానికి దానికి రిపోర్టర్లే లేరు. అలాంటి సంస్థ ఏపీలో భారీ ఎత్తున సర్వే చేశామని, టీడీపీకి 118, వైఎస్సార్సీపీకి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలినట్లు ప్రకటించింది. ప్రముఖ సర్వే సంస్థలన్నీ వైఎస్సార్సీపీ.. టీడీపీ కంటే 6 నుంచి 8 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుందని కచ్చితమైన లెక్కలతో వివరిస్తుండగా, ఈ సంస్థ మాత్రం వైఎస్సార్సీపీ కంటే టీడీపీకి 9.5 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నట్లు చెప్పడాన్ని బట్టి ఇది పూర్తిగా టీడీపీ సర్వే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ‘ఎలైట్ ఎలక్టోరల్ క్యాలిక్యులస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో విడుదలైన సర్వేలో టీడీపీకి 106 సీట్లు, వైఎస్సార్సీపీకి 68 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇది కూడా టీడీపీ నేతలు విడుదల చేయించిన సర్వే అని సమాచారం. ఈ రెండు సర్వే సంస్థలు రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నది చెప్పకుండా కొన్ని కాకిలెక్కలతో ఫలితాలను అంచనా వేయడం గమనార్హం. టుడేస్ చాణక్య పేరుతో విడుదలైన మరో సర్వే టీడీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు, వైఎస్సార్సీపీకి 8 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. కొద్దిరోజుల క్రితం కార్పొరేట్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. మిషన్ చాణక్య సర్వే సంస్థ దాన్ని ఖండించింది. తమ పేరును పోలిన సంస్థ పేరుతో బోగస్ సర్వే విడుదల చేశారని పేర్కొంది. ఇప్పుడు మిషన్ చాణక్య సంస్థ వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయట పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు, ఆయన కోటరీ ఉద్దేశపూర్వకంగా కొన్ని బోగస్ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేల వివరాలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు ఈ నెల 23న తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ అడగొచ్చు తప్పులేదు. బాబు, కిరసనాయిలు రేపటి నుంచి నీ ఫోన్లు కూడా ఎత్తరు. రాజగోపాల్ సర్వేలో ఆయన మెదడును ఆయన డీఎన్ఏ డామినేట్ చేసింది’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటో తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పొరుగున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేెెెమిటని ప్రశ్నించారు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడిపోవాలో చంద్రబాబు కంటే వాళ్లకే ( ఉత్తరాది నేతలు, కాంగ్రెస్ నాయకులు) బాగా తెలుసని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. బాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అంటున్నారట ప్రస్తుతం చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను, వీళ్లను కలుపుతా అంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇది చూసిన ఢీల్లీ నేతలు చంద్రబాబుకు ఈ మారుపేరు పెట్టారనీ, జోకులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. మరో ట్విట్లో ‘యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ తిరుగుతున్నారు సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, లక్నోలో తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్డీయేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే చంద్రబాబు ఐక్యత చర్చలంటూ తిరుగుతున్నారని విమర్శించారు.‘ ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయా, అఖిలేశ్, రాహుల్, పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. -
లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్ సర్వే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్ సర్వే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఆంధ్ర బెట్టింగ్ బుకీలతో డీల్ కుదుర్చుకొని బోగస్ సర్వేను ఆయుధంగా విడుదల చేశాడని దుయ్యబట్టారు. లగడపాటి సర్వేలను తెలుగు ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని, ఆయన సర్వేలకు కాలం చెల్లిందన్నారు. లగడపాటి సర్వే అంటేనే బెట్టింగ్‌ల కోసమే అనేది అందరికీ తెలిసిన రహస్యమే అన్నారు. తెలంగాణలోమహా కుటమి గెలుస్తుందని ప్రకటించి బోల్తా పడ్డాడని, ఇప్పుడు అదే తప్పిదాన్ని పునరావృతం చేస్తున్నాడన్నారు. బెట్టింగ్‌లను ప్రోత్సహించేలా బోగస్ సర్వే విడుదల చేసిన లగడపాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. బాబు ప్రాపకం కోసమే.. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): తన రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారడంతో లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యం చెప్పుకుంటూ మీడియాలో హల్చల్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బెట్టింగ్ రాయుళ్లను తప్పుదోవ పట్టించి రూ.కోట్లు దోచుకోవడంలో భాగంగానే చంద్రబాబు అండ్ కో లగడపాటిని అడ్డుపెట్టుకుని సర్వే నాటకాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. -
చిలుక జోస్యం కోసం ఖజానా లూటీ!
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడే తన గూటి చిలుక లగడపాటి రాజగోపాల్‌కు చెందిన బినామీ కాంట్రాక్టు సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన పనులు అప్పగించిన చంద్రబాబు, పనిలో పనిగా ఖజానా నుంచి రూ.124 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇప్పించేశారు. ఆ సొమ్ముతో పోలింగ్ పూర్తయిన తర్వాత తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో లగడపాటి ఫ్లాష్ సర్వే చేయించి.. ఆ ఫలితాలనే 175 నియోజకవర్గాలకు వర్తింపజేశారు. తరువాత చంద్రబాబు తన పలుకులనే పెంపుడు చిలుకతో శనివారం వల్లింపజేశారు. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో రీ పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయడానికే చిలుకతో ముందు కూయించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కళ్లెదుట ఓటమి సాక్షాత్కరిస్తున్న వేళ.. ఆదివారం మరో అడుగు ముందుకేసి చిలుకతో అశాస్త్రీయమైన సర్వే లెక్కలను వల్లింపజేసి.. కౌంటింగ్ వరకూ టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోశారు. చివరకు టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమని వక్రీకరించి.. కౌంటింగ్ రోజున ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే కుట్రలకు చంద్రబాబు పదును పెట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కుట్రలకు ప్రభుత్వ ఖజానా నుంచే నిధులను దోచిపెట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఖజానా నుంచే సర్దుబాటు ఎన్నికల్లో ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి లగడపాటి రాజగోపాల్‌తో సర్వేలు చేయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే సర్దుబాటు చేయడానికి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకుండానే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్), యోగి వేమన రిజర్వాయర్ (వైవీఆర్), హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతలను మంజూరు చేశారు. ఉజ్జాయింపు అంచనాల ఆధారంగా రూ.1,182.33 కోట్లతో ఈ పనులకు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్లు కుమ్మక్కయేలా చక్రం తిప్పారు. లగడపాటి బినామీకి చెందిన పవర్ మ్యాక్స్–ష్యూ (జేవీ) సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన ఆ పనులు దక్కేలా చేశారు. జాయింట్ వెంచర్(జేవీ)లో ప్రధాన వాటాదారు అయిన పవర్ మ్యాక్స్‌కు సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఎత్తిపోతల పనులు చేసిన అనుభవం లేదు. అందులో భాగస్వామి అయిన ష్యూ సంస్థ కూడా పనులు చేసిన అనుభవంపై ‘ఎక్సీ్పరియన్స్’ సర్టిఫికెట్స్‌ను షెడ్యూల్‌కు జత చేయలేదు. దీన్నే ఎత్తిచూపుతూ అక్రమాలు జరిగినట్టు నిర్థారణకు వచ్చిన కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) మార్చి 1న ఆ టెండర్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో ‘ఎక్సీ్పరియన్స్’ సర్టిఫికెట్లను సమర్పించడానికి మార్చి 7 వరకూ లగడపాటి బినామీ సంస్థకు గడువు ఇచ్చారు. మార్చి 7న రెండు దఫాలుగా సీవోటీ సమావేశాలు నిర్వహించినా.. ఎక్ప్సీరియన్స్ సర్టిఫికెట్లు సమర్పించడంలో ఆ సంస్థ విఫలమైనట్టు సీవోటీ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకు ఎక్ప్సీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే సదరు సంస్థకు పనులు కట్టబెడుతూ సీవోటీ టెండర్‌ను ఆమోదించింది. ఈ పనులను ఆ సంస్థకు అప్పగిస్తూ ఈనెల 8న కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నట్టుగా ఆగమేఘాలపై పత్రాలు తయారు చేసేలా జలవనరుల శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చి.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆ కాంట్రాక్ట్ ఒప్పందం ఆధారంగా అంచనా వ్యయంలో 10 శాతం అంటే రూ.124.08 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద లగడపాటి బినామీ సంస్థకు చెల్లించేలా చక్రం తిప్పారు. ఈ డబ్బుతోనే ఎన్నికల్లో పలు సర్వేలు నిర్వహించిన లగడపాటి.. వాస్తవాలను చంద్రబాబు చెవిలో వేశారు. ఓటమి ఖాయమని తేలడంతో.. పోలింగ్ ముగిసీ ముగియక ముందే ఈవీఎంలపై ఆ నెపాన్ని నెట్టే రీతిలో చంద్రబాబు పల్లవి అందుకున్నారు. కౌంటింగ్ వరకు టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోసి.. కౌంటింగ్ రోజున టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమనే భావనను బలపరిచేలా చేసి.. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి లగడపాటితో ఆదివారం అశాస్త్రీయమైన సర్వే ఫలితాల పేరుతో తన పలుకులను పలికించారు. ఇదే అదునుగా తీసుకున్న లగడపాటి బెట్టింగ్ రాయుళ్లతో కుమ్మక్కై.. అశాస్త్రీయమైన సర్వే ద్వారా చంద్రబాబు పలుకులను వల్లె వేశారు. -
లగడపాటి మాటలకు చేతలకు సంబందం ఉండదు
-
లగడపాటి చిలుక పలుకులు..
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ పెంపుడు చిలుక మళ్లీ పలికింది. స్వామికార్యంతోపాటు స్వకార్యం సాధించుకోవడానికి హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె ఉన్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివారం రీపోలింగ్ జరగనుండడంతో పెంపుడు చిలుకను పంజరం నుంచి వదిలారు. ఈ రీపోలింగ్‌లో ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించి, తన యజమానికి లాభం చేకూర్చడమే లక్ష్యంగా ఆ చిలుకు కొన్ని పలుకులు వినిపించింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని ఇప్పటికే తేటతెల్లం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా చూడ్డానికి, తామే అధికారంలోకి వస్తున్నామంటూ జోస్యం చెప్పి, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ఎన్నికల సిబ్బందిని భయపెట్టి లొంగదీసుకోవడానికి చిలుకను ప్రయోగించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఓవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మొద్దని చెబుతూనే లగడపాటి రాజగోపాల్‌తో చిలుక పలుకులు పలికిస్తుండడం గమనార్హం. ఏపీలో తెలుగుదేశమే గెలుస్తుందట! తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెట్టింగ్‌లు కాసి, సొమ్ము చేసుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గూటి చిలుక లగడపాటి రాజగోపాల్ పెద్ద స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించబోతున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆయన ఢంకా బజాయించారు. దాంతో బెట్టింగ్ రాయుళ్లంతా మహా కూటమి గెలుస్తుందంటూ పందేలు కాశారు. కానీ, లగడపాటి మాత్రం తన అనుచరులతో అధికార టీఆర్ఎస్ గెలుపు తథ్యమంటూ బెట్టింగ్‌లు కాసేలా జాగ్రత్తపడినట్లు విమర్శలు వినిపించాయి. చివరకు టీఆర్ఎస్ నెగ్గడంతో బెట్టింగ్‌ల్లో లగడపాటి మనుషులు భారీగా ఆర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని లగడపాటి అమలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలవడడానికి 24 గంటల ముందు, ఎన్నికల ఫలితాల వెల్లడికి నాలుగు రోజుల ముందు శనివారం సాయంత్రం 6 గంటలకు మీడియాతో మాట్లాడారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని తమ సర్వేలో తేలినట్లు సంకేతాలిచ్చారు. తెలంగాణలో చిలుక జోస్యాలు నమ్మి నష్టపోయాం.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జాతీయ టీవీ చానళ్లతోపాటు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తరువాత లగడపాటి చిలుక జోస్యాలను నమ్మి బెట్టింగ్‌లు కాసేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి ఉండదని, అందుకే పెంపుడు చిలుకు ముందే కూసిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని జాతీయ టీవీ చానళ్లతోపాటు పలు సర్వే ఏజెన్సీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా ఇదే విషయం వెల్లడి కానుంది. పందేంరాయుళ్లను టీడీపీ వైపు మళ్లించి, తన మనుషులతో వైఎస్సార్సీపీ గెలుపుపై బెట్టింగ్‌లు కాసేలా చేయడమే లగడపాటి ఉద్దేశమని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ జోస్యాలను నమ్మి, పందేలు కాసి దెబ్బతిన్నామని, భారీగా నష్టపోయామని పలువురు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్‌ల్లో లాభాల కోసమే లగడపాటి ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడానికే ‘సైకిల్’ చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌లో 6,000 మంది ఓట్లు వేయాల్సి ఉంది. ఈ రీపోలింగ్‌లో ఓటర్లను ఎలాగైనా ప్రభావితం చేయాలని, వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వరాదని సీఎం చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే తన చిలుక లగడపాటిని ఎగ్జిట్ పోల్స్‌కు 24 గంటల ముందే రంగంలోకి దించారు. బాబు వ్యూహంలో భాగంగానే ఓటర్లను టీడీపీ వైపు మళ్లించడానికి లగడపాటి సైకిల్ అనే పదం ఉపయోగించారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చిలుక జోస్యాల కోసం లగడపాటికి ఇప్పటిదాకా రూ.1,240 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను చంద్రబాబు కట్టబెట్టారు. శనివారం విలేకరుల సమావేశానికి ముందు లగడపాటితో పలువురు టీడీపీ నాయకులు గంటల పాటు మంతనాలు జరపడం గమనార్హం. -
లగడపాటి సర్వే దొంగ సర్వే
-
చిలక జోస్యాలకు రూ.400 కోట్లు ‘ఎక్సెస్’
సాక్షి, అమరావతి: లగడపాటి సర్వేల కోసం ప్రభుత్వ నిధుల ‘ఎత్తిపోత’ కార్యక్రమం జరుగుతోంది. ప్రజల సొమ్ముతోనే ప్రజా నాడి తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణ ఎన్నికల్లో ‘టీడీపీ–కాంగ్రెస్’ కూటమి తరఫున సర్వే లు చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కే ఈ సర్వేల బాధ్యత అప్పగించారు. ఈ సర్వేలకయ్యే నిధులను సమకూర్చేందుకుగానూ రూ.వేల కోట్ల విలువైన ఎత్తిపోతల పథకాల పనులు అప్పగి స్తున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ జలవనరుల శాఖ అధికారవర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)–యోగి వేమన రిజర్వాయర్(వైవీఆర్)–హంద్రీ–నీవా (హెచ్ఎన్ ఎస్ఎస్) రెండో దశ ఎత్తిపోతల పథకం టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలే ఇందుకు తార్కాణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వివరాలు.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ)లో అంతర్భాగమైన సీబీఆర్ నుంచి రెండు వేల క్యూసెక్కులను వైవీఆర్లోకి ఎత్తిపోసి.. అక్కడ్నుంచి హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ(386.90 కి.మీ వద్ద)లోకి ఎత్తిపోసి.. కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే పనులకు రూ.1,796.99 కోట్లతో జనవరి 29న ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. సీబీఆర్‌లో నీటి లభ్యత లేదని హైడ్రాలజీ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక వైపు వెళ్లకుండా.. కేవలం ఉజ్జాయింపు అంచనాలు ఆధారంగా ఈ పథకాన్ని మంజూరు చేసింది. ఇదే అంశాన్ని పరిపాలన అనుమతులిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని అనంతపురం జిల్లా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలను సాక్షాత్తూ సీఎం చంద్రబాబే బుట్టదాఖలు చేయించారు. సర్వేల కోసం లగడపాటితో ఒప్పందం.. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు, వెలువడిన తర్వాత, పోలింగ్‌కు మూడు రోజుల ముందు వరకు.. ఇలా విడతల వారీగా సర్వేలు చేసి రాజకీయ పరిస్థితులు, టీడీపీ అభ్యర్థుల విజయావకాశాలపై ఎప్పటికప్పుడు నివేదికలిచ్చే అంశంపై ఇటీవల మాజీ ఎంపీ లగడపాటితో సీఎం చంద్రబాబు పలుమార్లు సమావేశమై చర్చించారు. ఈ సర్వేలకయ్యే నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే సమకూర్చడానికి చంద్రబాబు ప్రణాళిక రచించారు. లగడపాటి బినామీకి చెందిన ఒక కాంట్రాక్టు సంస్థకు సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ పనులు అప్పగించేసి.. మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చే మొత్తాన్ని సర్వేలకు వినియోగించేలా ఇరువురి మధ్య ఒప్పందం కుదిరినట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ఆ ఒప్పందంలో భాగంగానే సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల పనులకు రూ.1,182.33 కోట్ల అంచనా వ్యయంతో ఒకే ప్యాకేజీ కింద జనవరి 30న టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. ఎక్కడైనా జాయింట్ వెంచర్లు చెల్లవ్.. కానీ ఇక్కడ కాదు! కర్నూలు జిల్లాలోని రాజోలిబండ కుడి కాలువ ప్రాజెక్టుకు రూ.1,557.37 కోట్లతోనూ.. వేదవతి ఎత్తిపోతల పథకం పనులకు రూ.1,536.28 కోట్లతోనూ ఎల్ఎస్(లంప్సమ్) ఓపెన్ విధానంలో జనవరి 29న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల టెండర్లలో జాయింట్ వెంచర్లు.. అంటే ఒక కాంట్రాక్టు సంస్థ కంటే ఎక్కువ సంస్థలు జట్టుగా ఏర్పడి షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం లేదనే నిబంధన పెట్టారు. కానీ సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల టెండర్లో మాత్రం జాయింట్ వెంచర్లు కూడా షెడ్యూల్ దాఖలు చేయడానికి అర్హులే అంటూ నిబంధనలు మార్చారు. మరోవైపు లగడపాటి బినామీకి చెందిన సంస్థకు ఇంతకుముందు సాగునీటి ప్రాజెక్టుల పనులు చేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన కోటరీలోని ఒక ప్రధాన సంస్థను లగడపాటి బినామీ సంస్థతో జట్టు కట్టేలా చేసి.. షెడ్యూల్ దాఖలు చేయించడానికే ఈ నిబంధన పెట్టారన్నది స్పష్టమవుతోంది. టెండర్లో నిబంధనల ప్రకారం 5 శాతం వరకూ అధిక(ఎక్సెస్) ధరకు షెడ్యూల్ దాఖలు చేయొచ్చు. అంత కంటే ఎక్కువ ధరకు షెడ్యూల్ కోట్ చేస్తే వాటిని రద్దు చేయాలి. కానీ.. ఎక్కువ ధరకు షెడ్యూల్ దాఖలు చేసినా కూడా ప్రభుత్వ అనుమతి మేరకు ఆమోదించవచ్చని, లేదా టెండర్లో పేర్కొన్న ధరకు.. అంటే రూ.1,182.33 కోట్లకు ఎవరైనా కాంట్రాక్టర్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉందని నిబంధన పెట్టారు. లగడపాటి బినామీ సంస్థకు ఈ పనులు కట్టబెట్టడానికే ఈ నిబంధనలు పెట్టారన్నది స్పష్టమవుతోంది. ఈ టెండర్లో ఈనెల 25 వరకు షెడ్యూల్ దాఖలు చేసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం 5కి టెక్నికల్ బిడ్.. 26న ప్రైస్ బిడ్ తెరిచి ప్రభుత్వ అనుమతితో లగడపాటి సంస్థకు పనులు కట్టబెట్టడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.410 కోట్లకుపైగా అంచనా వ్యయం పెంపు.. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ రూపొందించిన 2018–19 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి పనికి సగటున రూ.90 చెల్లించాలి. క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనులకు సగటున రూ.4,859 చెల్లించాలి. సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల్లో 1,69,35,436 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాలి. ఇందుకు రూ.458,12,30,908 ఖర్చు అవుతుందని టెండర్లో పేర్కొన్నారు. అంటే ఒక క్యూబిక్ మీటర్ మట్టి పనికి రూ.270.51 చెల్లిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎస్‌ఎస్‌ఆర్‌లో పేర్కొన్న ధర కంటే ఇది మూడింతలు ఎక్కువ. ఒక్క మట్టి పనుల్లోనే రూ.300 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేశారు. ఇక ఈ ఎత్తిపోతల పనుల్లో 2,52,708 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. ఇందుకు రూ.159,39,66,732 ఖర్చు అవుతుందని టెండర్లో పేర్కొన్నారు. అంటే ఒక క్యూబిక్ మీటర్‌కు సగటున రూ.6,307.54 చెల్లిస్తున్నట్లు లెక్క. దీన్ని బట్టి ఒక్క కాంక్రీట్ పనుల్లోనే అంచనా వ్యయాన్ని రూ.110 కోట్లకు పైగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది. సీబీఆర్ నుంచి ఆరు దశల్లో నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్‌ల నిర్మాణం కోసం రూ.482,24,64,331, ప్రెజర్ మైన్ కోసం రూ.82,58,21,723 వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయాన్ని పెంచేయడం ద్వారా లగడపాటి బినామీ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చబోతున్నట్లు స్పష్టమవుతోంది. -
లగడపాటి సర్వే: ప్రజాఫ్రంట్‌దే అధికారం !
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంటేనని ఆ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన విధంగా ఆయన ఎన్నికల అనంతరం తన సర్వే వివరాలను వెల్లడించారు. ఓవైపు జాతీయ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేసీఆర్‌కు పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం కూటమిదే అధికారమని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు 8 నుంచి 10 మంది అభ్యర్థులు గెలుస్తారని, పోలింగ్ శాతం తగ్గితే హంగ్ వస్తుందని బాంబు పేల్చిన లగడపాటి.. ప్రజలనాడీ హస్తం వైపే ఉందని హింట్ ఇచ్చారు. ఇండిపెండెంట్లు ఏడుగురు... తమ ఆర్జీ ఫ్లాష్ టీం సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు అనేక పర్యాయాలు ప్రజల నాడి, మనోభావాలు, వారు ఎటువైపు మొగ్గుచూపుతున్నారనే అంశాలపై సర్వే చేసిందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ రోజు తెలంగాణలో 72 శాతం పోలింగ్ నమోదైనట్టు తమకు ఓ అంచనా ఉందని, రాత్రి 9గంటలకు పూర్తి పోలింగ్ నమోదు శాతం వచ్చే అవకాశం ఉందన్నారు. అధిక శాతం పోలింగ్ ఈసారి నమోదైందని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఖర్చు పెట్టారని, ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఈ నేపథ్యంలో తను ముందుగా చెప్పినట్లు.. 8-10 మంది ఇండిపెండెట్లలో ఏడుగురు గెలుస్తారన్నారు. ఈ సంఖ్యకు రెండు పెరగవచ్చు.. రెండు తగ్గవచ్చని కూడా చెప్పారు. ఫ్రంట్ 55-75.. టీఆర్ఎస్ 25-45.. లగడపాటి లెక్క ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ 55 నుంచి75 సీట్లు గెలుస్తందన్నారు. టీఆర్ఎస్కు కేవలం 25- 45 మాత్రమే వస్తాయన్నారు. కూటమిలో భాగంగా 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి 5-9 సీట్లు వస్తాయని, బీజేపీకి 5-9, ఎంఐఎం 6-7, ఇతరులు 5-9 సీట్లు గెలుస్తారని జోస్యం చెప్పారు. బీఎల్ఎఫ్ కూడా ఖమ్మంలో ఒక సీటు గెలిచే అవకాశం ఉందన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పయ్యాయని, కానీ తాను చెప్పిన జోస్యం నిజమైందని గుర్తు చేశారు. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్.. లగడపాటి సర్వే ఫలితాల్లో ఏవి నిజమో తెలియాలంటే.. ఫలితాలు వెలువడే డిసెంబర్ 11 వరకు వేచిచూడాల్సిందే. -
వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు ఖాయం
- లగడపాటి సర్వే అవాస్తవం - రాష్ట్ర ప్రజలు వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు - పార్టీ నేతల ధీమా సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయించి చెప్పారు. పార్టీ గెలుపు విషయంలో కార్యకర్తలు, నేతలు ఏ మాత్రం సందేహించాల్సిన పనిలేదని 16న ఫలితాల వెల్లడి తరువాత సంబరాలు చేసుకుందామని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం అధికార ప్రతినిధులు ఓవీ రమణ, వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విడివిడిగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ విజయం పట్ల అణువంతైనా అనుమానం అక్కరలేదని ధీమా వ్యక్తంచేశారు. పందాల కోసమే లగడపాటి సర్వే: ఓవీ రమణ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేల్లో ఎంత మాత్రం నిజం లేదు. అవి చిల్లర దందాలు, పందాల కోసమే. ప్రామాణికత ఉన్న ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలన్నింటిలోనూ పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వస్తున్నాయి. ‘హిందూ’ లాంటి దినపత్రికల వార్తలు, పేరుమోసిన జాతీయ చానెళ్లు నిర్వహించిన సర్వేల్లో కూడా వైఎస్సార్ కాం గ్రెస్‌కు సీమాంధ్రలో స్పష్టమైన మెజారిటీ రాబోతోందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయి. లగడపాటి లాంటి వారు ఎల్లో మీడియాతో కలిసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎవరెంత దుష్ర్పచారం చేసినా వైఎస్సార్ గెలుపు వంద శాతం ఖాయం. స్థానిక ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేదు: నాగిరెడ్డి స్థానిక ఎన్నికల ఫలితాలకు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధమే లేదు. నేడు ప్రకటించబోయే శాసనసభ, లోక్‌సభ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు సాధించడం ఖాయం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత గత నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ కలిసి వైఎస్ కుటుంబాన్ని ఎలా వేధించాయో, వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు పన్నాయో ప్రజలంతా గమనించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్న బలీయమైన కాంక్ష ప్రజల్లో కనిపించింది. అదే మా పార్టీని విజయపథంలో నడిపిస్తుంది. ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ అవుతుంది: వాసిరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పు మావైపే ఉండబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ గెలవలేదని ప్రగల్భాలు పలికిన వారందరికీ నేటి గెలుపు గుణపాఠం కాబోతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ప్రత్యర్థుల ‘మైండ్ బ్లాంక్’ అవుతుంది. రాష్ట్ర ప్రజలు వైఎస్ కుటుంబం వెనుక ఉన్నారనే సత్యాన్ని మేము దగ్గర నుంచి చూశాం. 16న చారిత్రాత్మకమైన తీర్పు వెలువడబోతోంది. -
'లగడపాటి ఎలాంటి సర్వేలు చేయించలేదు'
గుంటూరు : లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే ఏ సంస్థలో చేయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అంబటి అన్నారు. లగడపాటి సర్వేను నమ్మి ఎవరూ పందాలు కాయొద్దని అంబటి సూచించారు. జాతీయ సంస్థలన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లడించాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల మధ్య నెలరోజుల సమయం ఉందని, ఆ సమయంలో చాలా మార్పులు జరిగాయని అంబటి పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు తాము పోటీ చేయలేమంటూ చేతులెత్తేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 110కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేశారు.