సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజాతీర్పుపై స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. ఒకట్రెండు తప్ప అన్ని సర్వేలూ జగన్‌కే పట్టంగట్టాయి. లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకున్న టీడీపీ ఊహలకు నేటి మధ్యాహ్నంతో తెరపడనుంది. ఏప్రిల్ 11న తొలి దశలో ఎన్నికలు జరిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ఈ 41రోజులపాటు నెలకొన్న టెన్షన్‌కు మరికొద్దిగంటల్లో తెరపడనుం ది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది బరిలో ఉండగా.. 25 ఎంపీ స్థానాలకు 319 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు లోపాయకారి ఒప్పందం తో పోటీ చేయగా..వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే బరి లో దిగింది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై దాదాపు స్పష్టమైన అంచనా వెలువడనుంది. దీంతో తెలంగాణతోపాటు ఏపీ పరిణామాలపైనా తెలుగుప్రజల్లో ఉత్సుకత నెలకొంది. ఓట్ల లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్య ర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలి పోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్ల లోనే ఓట్లలెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియో జకవర్గంలో అత్యధికంగా 33 రౌండు పూర్తి చేయా ల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశ ముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమ లూరు, గన్నవరం, నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రైండ్లకు పైగా పట్టే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment