
ముంబై : దలాల్ స్ట్రీట్‌నూ మోదీ మేనియా తాకింది. ఆకాశమే హద్దుగా సెన్సెక్స్, నిఫ్టీ దూసుకువెళ్లాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సార్వత్రిక సమరంలో ఘన విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు సత్తా చాటాయి. కొనుగోళ్ల వెల్లువతో అన్ని రంగాల షేర్లు అమాంతం ఎగిశాయి.
అదానీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 17 శాతం మేర పరుగులు పెట్టాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 1422 పాయింట్ల లాభంతో 39,352 పాయింట్ల వద్ద ముగిసింది. సరికొత్త శిఖరాలకు చేరిన నిఫ్టీ ఏకంగా 421 పాయింట్ల లాభంతో 11,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బీఐ, యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ తదితర షేర్లు భారీగా లాభపడ్డాయి.
ఇక ఎఫ్‌ఐఐలతో పాటు సంస్ధాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ ర్యాలీతో ఒక రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ 5.33 లక్షల కోట్ల మేర పెరిగింది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సత్తా చాటిన స్టాక్ మార్కెట్లు
Comments
Please login to add a commentAdd a comment