సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. దక్షిణాసియాలో శాంతి, పురోగతి కోసం తాను మోదీ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా ఇమ్రాన్ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే.
బీజేపీ సొంతంగా మేజిక్ మార్క్ 272 స్ధానాలు దాటి 300 స్ధానాలు గెలుపొందే దిశగా ఫలితాలు సాధిస్తోంది. ఏడు దశల్లో పోలింగ్ జరిగిన 542 లోక్‌సభ స్ధానాలకు గాను బీజేపీ ఇప్పటికే 14 స్ధానాల్లో గెలుపొంది మరో 288 స్ధానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment