‘బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు’ | Congress Must Die If Dont Stop BJP Says Yogendra Yadav | Sakshi
Sakshi News home page

బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు

Published Mon, May 20 2019 7:09 PM | Last Updated on Mon, May 20 2019 7:10 PM

Congress Must Die If Dont Stop BJP Says Yogendra Yadav - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ చావాల్సిందేనని స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యమ్నాయంగా నిలవడంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడలంటే బీజేపీని అడ్డుకోని తీరలనీ, అది సాధ్యం కాకపోతే కాంగ్రెస్‌ చావడం మేలని అన్నారు. 

కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. ఎన్డీయే కూటమికి 300లక పైగా స్థానాలు వస్తాయని తెలిపగా.. యూపీఏ కేవలం 120 స్థానాలలోనే పరితమైదని పలు సర్వేల సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement