అల్లు అర్జున్, మోహన్‌బాబు కూడా ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు దాడులు చేస్తే ఊరుకోం
భరోసా కేంద్రంతో బాలికలు, మహిళలకు భద్రత
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రం ప్రారంభం
కరీంనగర్ క్రైం: చట్టం ముందు అందరూ సాధారణ పౌరులేనని, నటులు అల్లు అర్జున్, మోహన్‌బాబు కూడా ఇందుకు అతీతులు కారని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ము న్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన మహిళా భద్రతా విభాగం డీఐజీ రెమా రాజేశ్వరితో కలసి ప్రారంభించారు. భరోసా కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చట్టం దృష్టిలో అల్లు అర్జున్ అయినా, మోహన్‌బాబు అయినా.. ఇతరత్రా ఎవరైనా అందరూ సమానులేనని, తప్పు చేస్తే ఎలాంటి తారతమ్యాలు లేకుండా చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు. మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల పేరిట అమాయకులపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
బాలికలు, మహిళల భ ద్రత కోసం ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలోని 23 ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించామని వివరించారు. ఈ కేంద్రాలు కేవలం తెలంగాణలోనే ఉన్నా యని, వీటి పనితీరును సుప్రీంకోర్టు కూడా అభినందించిందని గుర్తు చేశారు. ఈ కేంద్రాలు పోక్సో కేసుల దర్యాప్తులో సహాయపడతాయని, నిందితులకు శిక్ష పడే శాతాన్ని పెంచుతాయని డీజీపీ చెప్పారు. బాధితులు, మద్దతుదారులకు భద్రత కలి్పంచడంతోపాటు సాక్ష్యాలను సేకరించి కోర్టులో నిందితులకు శిక్ష పడేలా ఈ కేంద్రాలు కృషి చేస్తాయన్నారు.
బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా పనిచేస్తుందని అన్నారు. ఎఫ్‌ఐఆర్ మొదలు.. తుది పరిష్కారం వరకు భరోసా కేంద్రం బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు. కాగా, కరీంనగర్ భరోసా కేంద్రంలో నియామకాలు చేపట్టామని, ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సీపీ అభిõÙక్ మహంతి, శిక్షణ ఐపీఎస్ వసుంధరాయాదవ్, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, భరోసా కేంద్రం ఏసీపీ మాధవి, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బౌన్సర్లూ.. హద్దు దాటొద్దు
తెలంగాణ పోలీసుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: సినిమా తారలు, ఇతర ప్రముఖులకు రక్షణగా ఉండే బౌన్సర్లు, ప్రైవే టు బాడీగార్డులు.. చట్టాన్ని అతిక్రమిస్తే చర్య లు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బౌన్సర్లు, బాడీగార్డుల పేరిట.. చట్టానికి వ్యతిరేకంగా ఇతరులపై దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతోపాటు జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి బౌన్సర్లు, బాడీగార్డులు, వీరిని సమకూర్చే సంస్థలు ప్రభుత్వ, పోలీస్ నిబంధనలకు లోబ డి చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment