లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా? | Supreme Court questions film actor Mohan Babu | Sakshi
Sakshi News home page

లోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా?

Published Fri, Jan 10 2025 1:50 AM | Last Updated on Fri, Jan 10 2025 1:50 AM

Supreme Court questions film actor Mohan Babu

సినీనటుడు మోహన్‌బాబును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

జర్నలిస్ట్‌పై దాడి కేసులో విచారణ 

వచ్చేనెల 13వ తేదీకి వాయిదా 

అప్పటి వరకూ మోహన్‌బాబుపై బలవంతపు చర్యలొద్దు

రాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంటి లోపలకు వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్‌పై దాడి చేస్తారా’అంటూ సినీనటుడు మంచు మోహన్‌బాబును సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరోపక్క మోహన్‌బాబుపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్ర పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌ 10న జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ రాలేదు. దీంతో ఆయన డిసెంబర్‌ 24న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ సుధాంశు దులియా, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జర్న లిస్ట్‌పై దాడి జరిగిన సందర్భాన్ని మోహన్‌బాబు తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాస నానికి తెలిపారు. క్షణికావేశంలో మోహన్‌బాబు జర్నలిస్ట్‌ మైక్‌ లాక్కొని, అదే మైక్‌ను విసిరారన్నారు. అయితే ఈ ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే బాధిత జర్నలిస్ట్‌కు నష్టపరిహారం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని అభ్యర్థించారు. 

దవడ విరగడంతో.. పైపు ద్వారా ఆహారం
మోహన్‌బాబు దాడి చేయడం వల్లే జర్నలిస్ట్‌ దవడ విరిగిందని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసు కెళ్లారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరేందుకే మోహన్‌ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారని ధర్మాస నానికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకొని మోహన్‌బాబు జర్నలిస్ట్‌ను బెదిరించలేదని, అయినా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారన్నారు. మోహన్‌బాబు ఇంటిపైకి 20–30 మంది వచ్చారని, ఇది అతిక్రమణ కిందకు వస్తుందని చెప్పారు. మోహన్‌బాబు పేరున్న నటుడని, ఎవరినైనా చంపడం, బాధపెట్టడం ఆయనకు ఇష్టం లేదని ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. 

ప్రతివాదులకు నోటీసులు జారీ 
ఈ వాదనలపై జస్టిస్‌ దులియా స్పందిస్తూ..ఎవరైనా ఇంటిలోపలకు వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా అని మోహన్‌బాబు తరపు అడ్వొకేట్‌ రోహిత్గీని ప్రశ్నించారు. అయితే ఇరుపక్షాలు వాదనలు విన్న ధర్మాసనం..ప్రతివా దిగా ఉన్న బాధితుడు పరిహారం కోరుకుంటున్నారా చెప్పాలని కోరింది. దీనిపై జర్నలిస్ట్‌ న్యాయవాదితో మాట్లాడి, ఆయనకు ఏం కావాలో చేస్తానని ముకుల్‌ రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ వరకు మోహన్‌బాబుపై బలవంతపు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, జర్నలిస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement