
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్‌ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం గురువారం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్‌ను వినియోగించే ప్రైవేటు సంస్థ లు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది.
అవి..
1. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాగానే, అడ్మినిస్ట్రేటర్ ‘లాక్ మీటింగ్’ఆప్షన్‌ను ఆన్ చేయాలి.
2. ప్రతీ మీటింగ్‌కు కొత్తగా యూజర్ ఐడీని, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
3. అడ్మినిస్ట్రేటర్ అనుమతితోనే కొత్త సభ్యులు మీటింగ్‌లో పాల్గొనేలా ‘వెయిటింగ్ రూమ్’ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment