Not Safe
-
‘జూమ్’ సేఫ్ కాదు
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్‌ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం గురువారం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్‌ను వినియోగించే ప్రైవేటు సంస్థ లు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది. అవి.. 1. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాగానే, అడ్మినిస్ట్రేటర్ ‘లాక్ మీటింగ్’ఆప్షన్‌ను ఆన్ చేయాలి. 2. ప్రతీ మీటింగ్‌కు కొత్తగా యూజర్ ఐడీని, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. 3. అడ్మినిస్ట్రేటర్ అనుమతితోనే కొత్త సభ్యులు మీటింగ్‌లో పాల్గొనేలా ‘వెయిటింగ్ రూమ్’ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి -
‘వారి మీద బాంబులేయ్యాలి’
లక్నో : మనిషి ప్రాణం కంటే ఆవు చావుకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నేలకొన్న పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉందంటూ నటుడు నసీరుద్దిన్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం సురక్షితం కాదనే వారి మీద బాంబులు వెయ్యాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ జిల్లా ఖతౌళి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొంత మంది దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం వారికి సురక్షితం కాదని భావిస్తున్నారు. నాకే గనక ఓ మంత్రి పదవి ఉంటే ఇలాంటి వారందరి మీద బాంబులు వేసేవాడిని. ఒక్కరిని కూడా వదలే వాడిని కాదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అంటూ తెలిపారు. విక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. -
మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు!
‘‘సినిమా ప్రపంచంలో పురుషాధిక్యత ఉంటుంది అంటారు. ఆ మాటకొస్తే... ఒక్క సినిమా ప్రపంచం ఏం ఖర్మ.. అన్ని రంగాల్లోనూ పురుషులదే పై చేయి’’ అని శ్రుతీ హాసన్ అంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో పురుషాధిక్యత గురించి ప్రత్యేకంగా మాట్లాడారామె. ఆడవాళ్లు అణిగి మణిగి పడి ఉండాలని మగవాళ్లు కోరుకుంటారనీ, అంత మాత్రాన తగ్గాల్సిన అవసరంలేదనీ శ్రుతీ హాసన్ చెబుతూ -‘‘సినిమా నటి, పాత్రికేయురాలు, అధ్యాపకురాలు, గృహిణి.. ఎవరైనా కానివ్వండి మన దేశంలో అస్సలు రక్షణ లేదు. మీరు ఇంట్లో ఉండండి, వృత్తి రీత్యా హోటల్లోనో లేక గెస్ట్ హౌస్‌లోనో బస చేయండి.. రక్షణ ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. అందుకే మహిళలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వయసులో ఉన్నవాళ్లే కాదు... చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ ఇండియా అంత సురక్షితం కాదు’’ అని ముక్కుసూటిగా చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచిస్తున్న శ్రుతి తాను కూడా అలానే ఉంటారు. అందుకే, ఎవరో ఆగంతకుడు తన ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు వెంటనే స్పందించి, అతన్ని బయటికి నెట్టివేయగలిగారామె.