జూమ్‌ యాప్‌తో జర భద్రం | Zoom app vulnerable to cyber attacks says CERT-In | Sakshi
Sakshi News home page

జూమ్‌ యాప్‌తో జర భద్రం

Published Fri, Apr 3 2020 6:39 AM | Last Updated on Fri, Apr 3 2020 6:39 AM

Zoom app vulnerable to cyber attacks says CERT-In - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌  కల్లోలం నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నవారికి కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. వివిధ కార్యాలయాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీలుగా అత్యధికులు జూమ్‌ అనే వీడియో కాన్ఫరెన్స్‌ అప్లికేషన్‌ను వినియోగిస్తున్నారు. ఈ యాప్‌తో సైబర్‌ భద్రతా సమస్యలు ఉత్పన్నమవుతాయని, చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ దాడుల నుంచి రక్షణ జాతీయ సంస్థ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ–ఇన్‌) హెచ్చరించింది. ఈ జూమ్‌ అప్లికేషన్‌ వినియోగదారుల నుంచి సైబర్‌ నేరగాళ్లకు కార్యాలయాలకు సంబంధించిన కీలక సమాచారం అందిపోయే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.  సైబర్‌ నేరగాళ్లు ఈ యాప్‌ను సులువుగా హ్యాక్‌ చేసి  సమాచారాన్ని, సంభాషణలను తెలుసుకునే అవకాశాలున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement