సైబర్ క్రైమ్‌తో జర భద్రం.. | Online Crime | Sakshi

సైబర్ క్రైమ్‌తో జర భద్రం..

Nov 20 2015 12:16 AM | Updated on Sep 3 2017 12:43 PM

భారత్‌లో ఆన్‌లైన్ క్రైమ్ పెరిగిపోతోంది. గతేడాది భారత్‌లో 11.3 కోట్ల మంది సైబర్ క్రైమ్ బారినపడగా,

అహ్మదాబాద్: భారత్‌లో ఆన్‌లైన్ క్రైమ్ పెరిగిపోతోంది. గతేడాది భారత్‌లో 11.3 కోట్ల మంది సైబర్ క్రైమ్ బారినపడగా, వారు   సగటున రూ.16,558లను కోల్పోయారు. గ్లోబల్ యావరేజ్ రూ.23,878గా ఉంది.  నోర్టాన్ బై సిమంటెక్ సైబర్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం..  54 శాతం మంది భారతీయులు వారి వాలెట్ల ద్వారా కన్నా ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగలించడం ద్వారానే సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు.

ప్రతి ముగ్గురులో ఇద్దరు (66 శాతం మంది) వినియోగదారులు పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించడం కన్నా పబ్లిక్ వై-ఫైను ఉపయోగించడం ప్రమాదకరమని భావిస్తున్నారు. కారును ఒక రోజు ఇతరులకు ఇవ్వడం కన్నా స్నేహితులతో ఈ-మెయిల్ పాస్‌వర్డ్‌ను షేరు చేసుకోవడం చాలా ప్రమాదకరమని 80 శాతం మంది విశ్వసిస్తున్నారు. క్రెడిట్ కార్డు, బ్యాంకింగ్ సమాచారాన్ని క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవడం.. కారులో సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం కన్నా ప్రమాదమని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. గతేడాది భారతీయ ఆన్‌లైన్ యూజర్లలో 48 శాతం మంది (11.3 కోట్ల మంది) సైబర్ క్రైమ్‌ను ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement