న్యూఢిల్లీ: సైబర్‌దాడులను గుర్తించేందుకు, సమర్ధంగా ఎదుర్కొనేందుకు కంపెనీలు ఇకపై మరింతగా కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటివి ఉపయోగించనున్నాయి. అయితే, హ్యాకర్లు కూడా ఇదే సాంకేతికతతో మరింత వేగంగా, కచ్చితత్త్వంతో దాడులు చేసే ముప్పు కూడా పొంచి ఉంది. భారత మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ అంశంపై డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ), కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. డేటా గోప్యత, భద్రత విషయంలో.. నియంత్రణ సంస్థలపరమైన ఆంక్షలు 2020లో తారస్థాయికి చేరుకోనున్నాయి. దీంతో దేశీ సంస్థలు అటు అంతర్జాతీయంగా నియంత్రణలతో పాటు దేశీయంగా వ్యక్తిగత డేటా భద్రత చట్టాలకు కూడా అనుగుణంగా పనిచేయాల్సి రానుంది. ఫలితంగా డేటా భద్రతకు సంబంధించిన వ్యవస్థలను మెరుగుపర్చుకునేందుకు దాదాపు అన్ని సంస్థలూ మరింత వెచ్చించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment