
ముంబై: లాక్‌డౌన్ సమయంలో సైబర్ సెక్యూరిటీ అతి పెద్ద సవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ఆయన ఓ సంస్థ ఏర్పాటు చేసిన విబెనార్(ఆన్‌లైన్)లో మాట్లాడుతూ.. ఇటీవల లాక్‌డౌన్ కారణంగా మాల్‌వేర్, ట్రోజన్ దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్, సాఫ్ట్‌వేర్ తదితర అంశాలలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకుని సైబర్ దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. గేములు, టీవీ కంటెంట్ ద్వారా కీలకమైన డేటా ఒకరి నుంచి మరొకరికి వెళ్లిందని ఆయన అన్నారు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో ప్రజలు సైబర్ దాడుల పట్ల అప్రమత్తగా ఉండాలని గాంధీ వివరించారు.