
సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) తెలిపింది. రెండో ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ)లో సింగపూర్ తొలిస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్‌లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ సెక్రటరీ జనరల్ హౌలిన్ జహో తెలిపారు.