మీ మొబైలే మీ పర్సు... జాగ్రత్త!! | carefull about online cheatings and Cyber crimes | Sakshi
Sakshi News home page

మీ మొబైలే మీ పర్సు... జాగ్రత్త!!

Published Tue, Dec 13 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

మీ మొబైలే మీ పర్సు... జాగ్రత్త!!

మీ మొబైలే మీ పర్సు... జాగ్రత్త!!

ప్రస్తుతం రోజూ పోలీసులకు తమ మొబైల్‌ ఫోన్లు పోయాయని పలు రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఆన్‌లైన్‌ లావాదేవీలు, మొబైల్‌ వాలెట్లు పెరిగిన నేపథ్యంలో మీ మొబైల్‌ను ఇకపై మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీ మొబైలే మీ పర్సు. మొబైల్‌ పోతే మీ పర్స్‌ పోయినట్టే. అదెలాగంటే...

చాలా మొబైల్‌ వాలెట్లకు ఇంటర్నెట్‌ ఆన్‌లో ఉన్నపుడు ప్రతిసారీ లాగిన్‌ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పేటీఎం, మొబిక్విక్‌ వంటి వాలెట్లను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసి ఉంచారనుకోండి. మీ మొబైల్‌ గనక పోగొట్టుకున్నట్లయితే... ఆ మొబైల్‌ను చేజిక్కించుకున్న వ్యక్తి, దాన్లోని మీ వాలెట్లలో ఉన్న డబ్బులు మొత్తాన్ని కాజేసే అవకాశం ఉంది. ఆ వాలెట్‌ నుంచి మరో వాలెట్‌కు బదిలీ చేస్తే తరవాత దాన్ని తిరిగి రప్పించుకోవటం చాలా కష్టం. ఇలాంటివి జరక్కుండా చూడాలంటే మొదట మీ మొబైల్‌ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవటం ముఖ్యం. దాన్ని మొబైల్‌ గా మాత్రమే కాకుండా... పర్సులా  చూసుకోవాలి.
మొబైల్‌ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వద్దు. ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎన్ని వాలెట్లు పడితే అన్ని వాలెట్లూ డౌన్‌లోడ్‌ చేసుకుని, వాటిలో డబ్బులు వేయటం సరికాదు.
మొబైల్‌ వాలెట్లో మరీ ఎక్కువ డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. మీ లావాదేవీల అవసరాన్ని బట్టి తక్కువ మొత్తాన్ని వేసుకుంటే చాలు. ఒకవేళ మొబైల్‌ పోయినా, మీ వాలెట్లో వివరాలు చోరీకి గురైనా... నష్టం అందులో ఉన్న మొత్తానికి మాత్రమే పరిమితమవుతుంది.
ఇపుడు కొన్ని మొబైల్‌ వాలñ ట్లు అదనపు సెక్యూరిటీ ఫీచర్లను జోడిస్తున్నాయి. వాలెట్‌ ఓపెన్‌ చేయాల్సిన ప్రతిసారీ ప్యాటర్న్‌ లేదా పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. దీనివల్ల ఒకవేళ మీ మొబైల్‌ పోయినా, చోరీకి గురైనా... దాన్లోని వాలెట్‌ను మాత్రం అవతలి వ్యక్తులు అంత తేలిగ్గా యాక్సెస్‌ చేసుకోలేరు.
మీ మొబైల్‌ పోయిందనుకోండి! వెంటనే మీకు వాలెట్‌ పాస్‌వర్డ్‌ ఎలాగూ తెలిసి ఉంటుంది కనక మీ కంప్యూటర్‌ నుంచి లాగిన్‌ అయి... పాస్‌వర్డ్‌ మార్చేయండి. అపుడు మొబైల్‌ ద్వారా వాలెట్‌ను యాక్సెస్‌ చేయటానికి ప్రయత్నించినా... అది పాస్‌వర్డ్‌ అడుగుతుంది. మార్చిన పాస్‌వర్డ్‌ను అవతలి వ్యక్తి ఎంటర్‌ చేసే అవకాశం ఉండదు కనక మీ వాలెట్‌ సేఫ్‌గా ఉంటుంది.
మొబైల్‌ పోతే... తక్షణం మీ నెంబరును బ్లాక్‌ చేయిం^è ండి. అపుడు ఏ వాలెట్‌నూ అవతలి వ్యక్తి ఓటీపీ ద్వారా యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉండదు. నెంబరు బ్లాక్‌ చేయించకపోతే... మొబైల్‌ దక్కించుకున్న వ్యక్తి ఓటీపీ ద్వారా దాన్ని యాక్సెస్‌ చేసుకునే ప్రమాదముంటుంది.
ఆన్‌లైన్‌వైపు తప్పనిసరిగా మళ్లాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఈ జాగ్రత్తలు మారుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా బ్యాంకులు తదితర సంస్థలు కస్టమర్లలో అవగాహన పెంచి ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరం చాలా ఉంది.

 వచ్చే ఏడాది మొబైల్‌ మోసాలు 65% పెరగొచ్చు
అసోచామ్‌ అధ్యయనం
ఈ–వాలెట్లు, ఇతర అన్‌లైన్‌పేమెంట్‌ గేట్‌వేస్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీల జోరందుకుంటున్న నేపథ్యంలో మొబైల్‌ ద్వారా జరిగే మోసాలు బాగా పెరిగే అవకాశముందని పరిశ్రమ సమాఖ్య అసోచామ్, రీసెర్చ్‌ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదిక హెచ్చరిస్తోంది. మొత్తం సైబర్‌ నేరాల్లో మొబైల్‌ మోసాలు వచ్చే ఏడాదిలో 60–65 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది. దేశంలో ఒక వ్యాపారం ప్రారంభానికి లేదా అభివృద్ధికి ఇప్పుడు సైబర్‌ సెక్యూరిటీ చాలా ముఖ్యమని, అందుకే ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దాదాపు 40–45 శాతం ఆర్థిక చెల్లింపులన్నీ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు మొబైల్‌ మోసాల వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని వివరించింది. మొబైల్‌ మోసాలు వచ్చే ఏడాదిలో 60–65 శాతానికి చేరొచ్చని పేర్కొంది.

క్రెడిట్‌/డెబిట్‌ కార్డు మోసాలే అధికం..
సైబర్‌ నేరాల్లో క్రెడిట్‌ కార్డ్, డెబిట్‌ కార్డ్‌ మోసాలు టాప్‌లో ఉన్నాయని నివేదిక తెలిపింది. గత మూడేళ్లలో ఈ మోసాలు ఏకంగా ఆరు రెట్లు పెరిగాయని పేర్కొంది. సైబర్‌ నేరాల్లో  క్రెడిట్‌/డెబిట్‌ కార్డు మోసాల వాటా 46 శాతంగా ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానంలో ఫేస్‌బుక్‌ నేరాలు (39 శాతం), మొబైల్‌ మోసాలు (21 శాతం), ఈ–మెయిల్‌ ఐడీ హ్యాకింగ్‌ (18 శాతం), మోసపూరిత కాల్స్‌/ఎస్‌ఎంఎస్‌లు (12 శాతం) వంటివి ఉన్నాయని పేర్కొంది. సైబర్‌ దాడుల నుంచి కస్టమర్ల సమాచారాన్ని భద్రపరచడం కీలకమని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement