సైబర్ నేరాల నుంచి భద్రత కల్పించేందుకు, సాంకేతిక మౌలిక వసుతులను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక ఆర్థిక అత్యవసరసహాయ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు...
జైపూర్: సైబర్ నేరాల నుంచి భద్రత కల్పించేందుకు, సాంకేతిక మౌలిక వసుతులను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక ఆర్థిక అత్యవసర సహాయ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దేశం పయనిస్తున్న తరుణంలో సైబర్ నేరాల గురించి ప్రజల్లో భయం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ పేర్కొన్నారు. జైపూర్‌లో జరుగుతున్న సాహిత్య వేడుకల్లో శనివారం ఆమె పాల్గొన్నారు.