Rs 27 lakh
-
ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మోసాలకు బలైపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నవారు కోకొల్లలు. ఇటీవల ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ మహిళ సుమారు రూ. 27 లక్షలు పోగొట్టుకుంది.నోయిడాలోని సెక్టార్ 82లో నివాసం ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 'జ్యోత్సానా భాటియా'కు ఆగస్టు 31న టెలికాం కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపింది. మొబైల్ ఫోన్ పోయినట్లయితే.. యాక్టివేట్ అయ్యే ఈసిమ్ కొత్త ఫీచర్ల గురించి కాలర్ ఆమెకు చెప్పినట్లు వెల్లడించింది. కాలర్ చెప్పేది నిజమని నమ్మని భాటియా 'ఈసిమ్'కు మారేందుకు అతడు సూచించిన విధంగా చేసింది. ఇందులో భాగంగానే ఆమె మొబైల్‌కు వచ్చిన ఒక కోడ్ ఎంటర్ చేయమని అడగగా.. ఆమె అది కూడా పూర్తి చేసింది.కాలర్ చెప్పినవన్నీ చేసిన తరువాత ఆమె సిమ్ డీయాక్టివేట్ అవుతుందని.. మరో రెండు మూడు రోజుల్లో ఫిజికల్ సిమ్ వస్తుందని చెప్పాడు. మూడు రోజుల తరువాత కూడా ఆమెకు సిమ్ రాలేదు. దీంతో ఆమె కస్టమర్ కేర్ సిబ్బందికి కాల్ చేసింది. వారు డూప్లికేట్ సిమ్ కోసం సర్వీస్ సెంటర్ వద్దకు రావాలని సూచించారు. ఆమె వారు చెప్పినట్లుగా సర్వీస్ సెంటర్ వద్ద డూప్లికేట్ సిమ్ తీసుకుని ఫోన్లో వేసుకుని యాక్టివేట్ చేసింది.మొబైల్ నెంబర్ యాక్టివేట్ అవ్వగానే.. బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు డిడెక్ట్ అయినట్లు వరుస మెసేజ్‌లు వచ్చాయి. సైబర్ నేరస్థుడు తన ఫిక్డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీసుకున్నట్లు, కొంత డబ్బు ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమె పేరుమీద రూ. 7.40 లోన్ కూడా తీసుకున్నట్లు తీసుకుంది.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం సైబర్ నేరగాడు.. మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ అప్లికేషన్ హ్యాక్ చేసి.. ఈ మెయిల్ ఐడీలను సైతం మార్చేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. మొత్తం మీద ఆమె రూ. 27 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపింది. నిందితున్న పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.ఈ-సిమ్ అంటే..ఈ-సిమ్ అనేది ఒక డిజిటల్ సిమ్ కార్డు. కాబట్టి ఈ-సిమ్ ఉపయోగిస్తే.. ఫిజికల్ సిమ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనిని అధికారిక వెబ్సైట్లో లేదా సర్వీస్ సెంటర్లలో పొందవచ్చు. ఈ-సిమ్ పొందాలనుకునేవారు టెలికామ్ ఎగ్జిక్యూటివ్‌ను కలిసిన తరువాత మారడం ఉత్తమం. -
ఈ బాబా వాచీ ఖరీదు రూ.27 లక్షలట!
హరిద్వార్: సాధారణంగా బాబా, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అనుకుంటాం. కానీ ఇటీవల హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాకు హాజరైన ఓ బాబాను చూస్తే ఈ అభిప్రాయం తప్పేమోనన్న అనుమానం కలుగుతుంది. ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతూ సదరు సన్యాసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఏకంగా మూడున్నర కిలోల బంగారాన్ని ధరించి గంగానదిలో స్నానమాచరించి వస్తున్న బాబాను చూసి అక్కడున్నవారంతా నోళ్లు వెళ్లబెట్టారు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు, కమండలం తదితరాలతో సాదాసీదాగా ఉండాల్సిన సన్యాసి కాస్తా రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో మెరిసిపోయాడు. ఒకటా రెండా మెడ నిండా బంగారు గొలుసులు, లాకెట్లు.. అన్ని చేతివేళ్లకు బరువైన ఉంగరాలు. చేతికి పెద్ద వెడల్పాటి కడియం, డైమండ్ వాచ్. ఇలా సన్యాసులకు భిన్నమైన అవతారంతో తన శిష్యులు, అనుచరుల మందీ మార్బలంతో గంగా స్నానమాచరించడం ఆసక్తికరంగా మారింది. వజ్రాలు పొదిగిన ఆయన చేతి వాచీ సుమారు రూ. 27 లక్షల ఖరీదు చేస్తుందట. అయితే సన్యాసికి ఇంత బంగారం ఎందుకు అని ఎవరైనా అంటే ఈ బాబా అనుచరులు, శిష్యులకు కోపం వస్తుంది. బంగారం ఎంత స్వచ్ఛమో, ఎంత అమూల్యమో తమ గురువుకూడా అంతే విలువైనవాడంటూ వెనకేసుకొస్తున్నారు. మా గోల్డెన్ బాబా సేవలు అమూల్యమైనవంటూ మురిసిపోతున్నారు కాగా గోల్డెన్ బాబాగా చెప్పుకునే ఈయన గతంలో ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసేవాడట. ఈయన అసలు పేరు సుధీర్ కుమార్ మక్కడ్(53 ). అయితే అప్పుడు ఎన్నో పాపాలు, పొరబాట్లు చేశానంటున్నాడీ గోల్డెన్ బాబా. ఆ పాపాలను కడిగేసుకోవడానికి సన్యాసిగా మారిపోయానంటున్నాడు. వ్యాపారం చేసే క్రమంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సన్యాసం స్వీకరించానని చెబుతున్నాడు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కష్టపడుతున్న పేద తలిదండ్రులకు, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తుంటానని చెబుతున్నాడు.