ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అంతర్జాతీయ విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రితేష్ పాయ్‌ను తమ ఇంటర్నేషనల్ పేమెంట్స్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.
ఫోన్‌పేలో చేరిన రితేష్ పాయ్.. యూకేకి చెందిన టెర్రాపే (TerraPay)లో ప్రాడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ విభాగానికి ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. యస్ బ్యాంక్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా కూడా పనిచేసిన ఆయన అక్కడ బ్యాంక్ డిజిటల్ వ్యూహానికి నాయకత్వం వహించారు. రితేష్ పాయ్ చేరికపై ఫోన్‌పే చీఫ్, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి రితేష్ మాతో చేరినందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫోన్‌పే 2015 డిసెంబర్‌లో ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసి వాలెట్‌గా రీబ్రాండ్ చేసింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. యూపీఐ యాప్‌ను ప్రారంభించిన మూడు నెలల్లోనే కోటి మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2018లో గూగుల్ ప్లేస్టోర్‌లో ఐదు కోట్ల బ్యాడ్జ్‌ని పొందిన అత్యంత వేగవంతమైన భారతీయ చెల్లింపు యాప్‌గా ఫోన్‌పే నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment