
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే రోజుకు 10 కోట్లకుపైగా లావాదేవీల మార్కును దాటింది. నెలకు 250 కోట్ల లావాదేవీలను పూర్తి చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ఫోన్‌పే వేదికగా ఏటా రూ.59,28,000 కోట్ల విలువ చేసే చెల్లింపులు నమోదవుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోనూ డిజిటల్ వైపు కస్టమర్లు పెద్ద ఎత్తున మళ్లడమే ఈ స్థాయికి కారణం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,000 పైచిలుకు పిన్‌కోడ్స్ నుంచి ఫోన్‌పేకి వినియోగదారులు ఉన్నారు. యాక్టివ్ యూజర్లు నెలకు 16.5 కోట్ల మంది. నమోదిత యూజర్ల సంఖ్య 37 కోట్లకుపైమాటే. నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్‌పే వాడుతున్నారు. 3 కోట్ల ఆఫ్‌లైన్ రిటైలర్లు సంస్థ వేదికపైకి వచ్చి డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు’ అని ఫోన్‌పే వివరించింది.
చదవండి: 1.5 లక్షల మొబైల్ రిటైలర్ల భవిష్యత్తు అయోమయం
Comments
Please login to add a commentAdd a comment