హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు దేశంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలంటే ఏడాది ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సిందే. ఇక నుంచి సులభంగా నెల వాయిదాల్లో హెల్త్ పాలసీ తీసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే భారత్‌లో తొలిసారిగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఇందుకోసం ఆరోగ్య బీమా సంస్థలతో ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ చేతులు కలిపింది. ‘రూ.1 కోటి వరకు బీమా కవరేజ్ ఉంది. ఎటువంటి పరిమితి లేకుండా ఆసుపత్రిలో గదిని ఎంచుకోవచ్చు. క్లెయిమ్ చేయనట్టయితే ఏడాదికి బేస్ కవర్ మొత్తం మీద ఏడింతల వరకు బోనస్ కవర్ పొందవచ్చు’ అని ఫోన్‌పే ప్రకటించింది.
ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ప్రస్తుతానికి ఫోన్‌పే వేదికగా కేర్ హెల్త్, నివా బూపా నెల వాయిదాల్లో ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 లక్షలకుపైగా పాలసీలను విక్రయించినట్టు ఫోన్‌పే తెలిపింది. ఇక ఫోన్‌పే యూజర్ల సంఖ్య 47 కోట్లకుపైమాటే.
Comments
Please login to add a commentAdd a comment