ప్రముఖ యూపీఐ పేమెంట్స్ కంపెనీ భారత్‌పే ‘బై నౌ పే ల్యాటర్’ అంటూ పోస్ట్‌పే యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోస్ట్‌పే బ్రాండ్ నేమ్ కాపీరైట్ వ్యవహరంలో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే బాంబే హైకోర్టు మెట్లను ఎక్కింది.
చదవండి: మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...!
ఎందుకంటే..?
రెసిలియంట్ ఇన్నోవేషన్స్‌కు చెందిన పోస్ట్‌పే యాప్‌లో 'Pe' ప్రత్యయం వినియోగంపై రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లను దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని కోరుతూ ఫోన్‌పే బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల ఆరో తారీఖున పోస్ట్‌పే సేవలను భారత్‌పే ప్రారంభించింది. ఈ విషయంపై బాంబే హైకోర్టులో ఫోన్‌పే అభ్యర్థనపై, కోర్టు అక్టోబర్ 22న విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా పోస్ట్‌పే ఫోన్‌పే ప్రత్యయాన్ని పోలి ఉందనే విషయాన్ని హైకోర్టు గమనించింది. అయితే కోర్టు చేసిన కొన్ని పరిశీలనలను పరిష్కరించడం కోసం పిటిషన్‌ను ఫోన్‌పే ఉపసంహరించుకుంది. కాగా భారత్‌పే పై మరో దావాను వేసేందుకు సిద్దమైనట్లు కంపెనీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే మొదటిసారి కాదు..!
ఫోన్‌పే ‘పే’ ప్రత్యయం వినియోగంపై భారత్‌పేని కోర్టుకు లాగడం ఇదే మొదటిసారి కాదు. 2019 సెప్టెంబరులో ఫోన్‌పే ఇదే విధమైన నిషేధాన్ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా...అప్పుడు కోర్టు భారత్‌పే ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ఫోన్‌పే పిటిషన్‌ను తోసిపుచ్చింది.
చదవండి: ఫేస్‌బుక్ నెత్తిన మరో పిడుగు..!
Comments
Please login to add a commentAdd a comment