
అర్వపల్లి: అంతా డిజిటల్‌మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్‌పే, గూగుల్‌పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్‌లో యాచకుడు యాచించగా యజమాని గోవర్ధన్ నగదు లేదన్నాడు. వెంటనే యాచకుడు తన వద్ద ఉన్న డిజిటల్ పేమెంట్ స్కానర్‌ను చూపించాడు. దీంతో గోవర్దన్ తన సెల్‌తో స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లించాడు.
ఈ సందర్భంగా యాచకుడు చిన్నమారన్న మాట్లాడుతూ.. అంతా డిజిటల్ కాలం కావడంతో యాచకులం కూడా మారాల్సి వచ్చిందని చెప్పాడు. తనది ఏపీలోని నంద్యాల జిల్లా గుండాల (ఎస్) గ్రామమని తెలిపాడు. హనుమాన్ వేషధారణలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతూ యాచిస్తున్నట్లు చెప్పాడు.