సాక్షి, న్యూఢిల్లీ : గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్ వ్యవస్థను నిర్వహించదని ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో జీ పే లేదని పేర్కొంది. అయితే గూగుల్ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్‌బీఐ నివేదించింది.
ఇక గూగుల్ పే ఆన్‌లైన్‌లో చెల్లింపుల లావాదేవీలకు వేదికని, ఇది యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. గూగుల్ పే రియల్ టైమ్‌లో మోసపూరిత, అనుమానిత లావాదేవీలను గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment