గూగుల్ ఆధ్వర్యంలోని పేమెంట్ యాప్ గూగుల్‌పే మొబైల్ రీఛార్జీలపై అదనంగా ఫీజు వసూలు చేయనుంది. ఏ విధానంలో పేమెంట్ చేసినా కన్వీనియన్స్ ఛార్జీల రూపంలో ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం సంస్థలు ఇదే మాదిరి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా సేవలందించిన గూగుల్‌పే ప్రస్తుతం ఛార్జీలు వసూలు చేయనుందనే వార్తలు వస్తున్నాయి.
అయితే రూ.100లోపు రీఛార్జిపై గూగుల్‌పే ఎలాంటి ఫీజూ వసూలు చేయబోదని కొన్ని మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. రూ.100 నుంచి రూ.200 వరకు రీఛార్జిపై ఒక రూపాయి, రూ.200 నుంచి రూ.300 వరకు రూ.2, రూ.300 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ.3 చొప్పున కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు సమాచారం. కొత్తగా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు గూగుల్ నిబంధనలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment