ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ పేమెంట్స్ మరింత సులభతరం చేసేందుకు మూడు సరికొత్త ఫీచర్స్ పరిచయం చేసింది. అవి "రివార్డ్స్, బై నౌ పే లేటర్, సెక్యూరిటీ ఫీచర్.
రివార్డ్‌లు
ప్రస్తుతం క్రెడిట్ కార్డ్‌ల వినియోగం పెరిగిపోయింది. అయితే కార్డులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కొన్ని ప్రయోజనాలను పొందుతారు. దీని కోసం తనిఖీ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గూగుల్ పే పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ ముందుగానే రివార్డ్‌లు గురించి చూపిస్తుంది.
ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండి
ఇప్పుడు కొనండి.. మళ్ళీ చెల్లించండి అనే స్కీమ్ ఒకప్పుడు కొన్ని కార్ల కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. సరిగ్గా ఇలాంటి ఫీచర్ గూగుల్ పే పరిచయం చేసింది. వస్తువులను కొనుగోలు వినియోగదారు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా.. మళ్ళీ చెల్లించవచ్చు. లేదా వాయిదాల రూపంలో కూడా చెల్లించవచ్చు. దీని కోసం అమౌంట్ చెల్లించే సమయంలోనే.. ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో అందుబాటులో ఉంది. మన దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.
సెక్యూరిటీ ఫీచర్
ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో మరింత సురక్షితమైన లావాదేలీల కోసం గూగుల్ పే ఆటోఫిల్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇది వేలిముద్ర, స్క్రీన్ లాక్ PIN లేదా ఫేస్ స్కాన్ ద్వారా సేవ్ చేసిన కార్డ్ వివరాలను ఆటోమేటిక్‌గా ఇన్‌పుట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment