పైన్ ల్యాబ్స్ యాజమాన్యంలోని సంస్థ క్విక్ సిల్వర్ భాగస్వామ్యంతో గూగుల్ పే తన ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ గిఫ్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఇది 150 కంటే ఎక్కువ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ బ్రాండ్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను 1500 నగరాల్లోని భారతదేశంలోని ప్రజలకు అందించనున్నట్లు తెలిపింది. ఈ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్, ఉబెర్ ఇ-గిఫ్ట్, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ మరియు గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్ మొదలైనవి ఉన్నాయి. క్విక్ సిల్వర్ మరో కన్జ్యూమర్ బ్రాండ్ అయిన వోహోను గూగుల్ పే స్పాట్ ప్లాట్ ఫాంపై లిస్ట్ చేసింది. దీని ద్వారా ఆఫ్‌లైన్ వ్యాపారాలు గూగుల్ పేలో వర్చువల్ గిఫ్ట్ కార్డులను తయారుచేయవచ్చు.
వోహో, గూగుల్ పే భాగస్వామ్యంతో ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్ పెరగనుంది. ఎందుకంటే వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. గూగుల్ పేలో వోహోను సెర్చ్ చేయడం ద్వారా వర్చువల్ బహుమతి కార్డును పంపవచ్చు. అది కాకపోయినా బిజినెస్ ట్యాబ్ లో ఉండే గిఫ్ట్ కార్డ్ స్టోర్ లోని కార్డులలో ఎంచుకుని పంపుకోవచ్చు. ఒక్కసారి కొంటే ఆ డిజిటల్ కార్డును ఈ మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పంపుకోచ్చు. అప్పుడే మనకు రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులం అవుతాం. భారతదేశంలోని 10 బహుమతి కార్డులలో తొమ్మిది కార్డులు ఇ-కామర్స్, కిరాణా మరియు ఫ్యాషన్ విభాగానికి చెందినవి. క్విక్ సిల్వర్.. వోహో డిజిటల్ కార్డ్ స్టోర్ ను ఆన్ చేసి ఉంచింది. బటన్ క్లిక్ చేసి డిజిటల్ గిఫ్టింగ్ విధానం ద్వారా కన్జ్యూమర్ ఎక్స్‌పీరియన్స్ మరింత బెటర్ గా పొందొచ్చని పైన్ ల్యాబ్స్ ప్రెసిడెంట్ కుమార్ సుదర్శన్ స్టేట్‌మెంట్లో చెప్పారు. గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం అనేది గతేడాదే లాంచ్ అయింది. వ్యాపారులు తమ స్పాట్‌ను గూగుల్ పేలో సెటప్ చేయడానికి గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం ద్వారా వీలు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment