ముంబై: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లలో యూపీఐ లైట్ ( UPI Lite ) వాలెట్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ( RBI ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది.
యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై చిన్న మొత్తాల చెల్లింపును వేగవంతం చేసేందుకు 2022 సెప్టెంబర్‌లో యూపీఐ లైట్‌ను ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ అంతంత మాత్రంగా ఉండే ప్రాంతాలు, అలాగే అసలు నెట్ ఉండని ప్రదేశాల్లో కూడా రిటైల్ డిజిటల్ చెల్లింపు లావాదేవీల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది.
అలాగే, బ్యాంకుల ప్రాసెసింగ్ వ్యవస్థలపై కూడా భారం తగ్గించడం వల్ల లావాదేవీలు విఫలమయ్యే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం దీని ద్వారా నెలకు 1 కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment