గూగుల్ పే యూజర్లకు షాకింగ్ న్యూస్ | Google Pay Web App To Stop Working From January 2021 | Sakshi
Sakshi News home page

గూగుల్ పే యూజర్లకు షాకింగ్ న్యూస్

Published Wed, Nov 25 2020 2:31 PM | Last Updated on Wed, Nov 25 2020 3:13 PM

Google Pay Web App To Stop Working From January 2021 - Sakshi

ప్రముఖ డబ్బులు చెల్లింపుల సంస్థ అయిన గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ సేవల నిలివేయనున్నట్లు తెలిపింది. అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటి వరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్ ను ఉపయోగించే వారు. (చదవండి: ట్విటర్ లో మరో కొత్త ఫీచర్)   

"2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్ ను ఉపయోగించండి" అని కంపెనీ అమెరికా ప్రజలకు సమాచారం ఇచ్చింది. గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​-టూ-పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు కూడా అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమేనని భారత యూజర్లకు కాదని తెలిపింది. ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement