గూగుల్ మరో కొత్త యాప్ ని తీసుకొస్తుంది. "లుక్ టు స్పీక్" అనే ఈ యాప్ ద్వారా కళ్లతోనే చాట్ చేసే అవకాశం యూజర్లకు కలుగుతుంది. మన ఫోన్ లో ఉన్న పదాలను కళ్లతో చూస్తే అది గట్టిగా చదివి వినిపిస్తుంది. దీనిని ముఖ్యంగా మాట్లాడలేని వారిని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ 9పై వెర్షన్ గల యూజర్లకు అందుబాటులో రానుంది. దీనిని ఉపయోగించడానికి ముందుగా ఫోన్ స్థిరంగా పట్టుకొని అందులో ఉన్న పదాలను ఎడమ, కుడి లేదా పై వైపు చూడటం ద్వారా అక్కడ ఉన్న పదాలను ఎంపిక చేసుకోవచ్చు. కంటి చూపు సెట్టింగులను యాప్ లో మార్చుకునే అవకాశం ఉంది. గూగుల్‌లో ఇలాంటి ప్రాజెక్ట్‌పైనే పని చేస్తున్న ఓ టీమ్.. స్పీడ్, లాంగ్వేజ్ థెరపిస్ట్ సారా ఏజెకిఎల్, రిచర్డ్ కేవ్ లుక్‌తో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేసారు. ఈ యాప్ ని ఒక వ్యక్తి లేదా కమ్యూనిటీకి ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ యాప్‌ను డెవలప్ చేసినట్లు కేవ్ తెలిపారు. దీనిలో ఎక్కువగా ఉపయోగించే హలో, థ్యాంక్యూ, గ్రేట్, ఓకేలాంటి పదాలు ఉన్నాయి.(చదవండి: శామ్ సంగ్: రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ)
Comments
Please login to add a commentAdd a comment