చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కూడా ఉద్యోగాల తీసివేత దిశలో మరింతగా అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి పెరిగిన ఒత్తిడి, మార్కెట్ వాటా క్షీణత తదితర కారణాల నేపథ్యంలో ఉద్యోగులను, తద్వారా తగ్గించుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే షావోమి ఇండియా మరికొంత మందికి ఉద్వాసన పలకనుంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను దాదాపు వెయ్యికి తగ్గించుకోవాలని చూస్తోందట. దీంతో ఎపుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనలో ఉద్యోగులున్నారు. అయితే ఎంతమందిని, ఏయే విభాగాల్లో తొలగింనుందని అనేది స్పష్టత లేదు. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు)
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం షావోమి ఇండియా 2023 ప్రారంభంలో సుమారు 1400-1,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ ఇటీవల దాదాపు 30 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే నెలల్లో మరింత మందిని తొలగించాలని భావిస్తోంది. సంస్థాగత నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ, వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేసే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ)
ఇదీ చదవండి: తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?
Comments
Please login to add a commentAdd a comment