
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ ‘దీవాళీ విత్ ఎమ్‌ఐ సేల్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్‌లైన్ ఎక్స్కూజివ్ సేల్‌ను కూడా షావోమీ ప్రకటించింది. దీవాళీ విత్ ఎమ్‌ఐ సేల్ భాగంగా షావోమి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర గ్యాడ్జెట్స్‌పై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ నవంబరు 6 వరకు అందుబాటులో ఉండనున్నాయి. సేల్‌లో భాగంగా ప్రతి రోజు 64 మంది లక్కీ విన్నర్లకు రూ. 1000 నుంచి 5 లక్షల వరకు క్యాష్‌ప్రైజ్‌ను అందిస్తోంది. లక్కీ విన్నర్లకు లక్కీ డ్రా ద్వారా ఓ సెడాన్ కారు, సూపర్ బైక్స్ ను కూడా షావోమీ అందించనుంది.
చదవండి: సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..!
స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్..!
దీవాళి విత్ ఎమ్‌ఐ సేల్‌లో భాగంగా ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌పై గరిష్టంగా రూ.3 వేల వరకు డిస్కౌంట్‌ను కొనుగోలుదారులు పొందవచ్చును. షావోమీ 11 లైట్ ఎన్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 2000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
దీవాళి విత్ ఎమ్‌ఐ సేల్‌లో భాగంగా రెడ్ మీ నోట్ 10 సిరీస్, రెడ్ మీ 9 సిరీస్ లాంటి మోడళ్లపై రూ.1000ల వరకు డిస్కౌంట్‌ను షావోమీ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ కొనుగోలుపై 3 వేల వరకు క్యాష్ బ్యాక్‌ను షావోమీ అందిస్తోంది.
స్మార్ట్‌టీవీలపై షావోమీ అందిస్తోన్న ఆఫర్స్..!
పలు స్మార్ట్‌టీవీ మోడళ్లపై షావోమీ భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ సేల్‌లో రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ మోడల్ పై రూ.3000 నుంచి రూ.5000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. 32 అంగుళాల,55 అంగుళాల సైజ్‌లో గల ఎంఐ టీవీలపై రూ.1000నుంచి రూ.3000వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.3500 ఈఎమ్‌ఐ ఆపర్లను అందిస్తోంది.
చదవండి: టైటాన్ డబుల్ ధమాకా..!
Comments
Please login to add a commentAdd a comment