Xiaomi Black Friday Sale Starts Goes On Till November 30: అమెరికాలో థ్యాంక్స్‌గీవింగ్‌తో సాగే భారీ డిస్కౌంట్ల బ్లాక్ ఫ్రైడ్ సేల్ ఇప్పుడు భారత్‌లోని పలు కంపెనీలు మొదలుపెట్టాయి. అందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కూడా చేరింది. షావోమీ బ్లాక్ ఫ్రైడ్‌సేల్‌ను ప్రకటించగా, ఈ సేల్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవ్వగా నవంబర్ 30తో ముగియనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా టీవీలు, ల్యాప్‌టాప్స్, ఆడియో, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును షావోమీ ప్రకటించింది.
చదవండి: ఇండియా కుబేరుడు.. 2 సార్లు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు
కొనుగోలుదారులకు షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటుగా..పలు ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు రానుంది. అంతేకాకండా పలు షావోమీ ఉత్పత్తుల కొనుగోలుపై 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా షావోమీ అందించనుంది.
బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా పలు ఉత్పతులపై షోవోమీ అందిస్తోన్న ఆఫర్లు
►ఎమ్‌ఐ 11ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4 వేల తగ్గింపు.
►రెడ్‌మీ బుక్ 15 ల్యాప్‌టాప్ కొనుగోలుదారులకు రూ. 35,499కే లభించనుంది.
►ఎమ్‌ఐ టీవీ 4సీ 43ఇంచ్, ఎమ్‌ఐ టీవీ 4ఏ 43ఇంచ్ హరిజోన్ ఎడిషన్, రెడ్‌మీ స్మార్ట్‌టీవీ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీల కొనుగోలుపై రూ. 2000 వరకు డిస్కౌంట్.
►ఎమ్‌ఐ స్మార్ట్‌బ్యాండ్ 5 కొనుగోలుదారులకు రూ. 2270కు లభించనుంది.
►ఎమ్‌ఐ వాచ్ రివాల్వ్ క్రోమ్, ఎయిర్ పూరిఫైయర్ 3 ఉత్పత్తులపై 2 వేల తగ్గింపు.మరిన్ని ఆఫర్లను షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చును.
చదవండి: స్మార్ట్‌ఫోన్లకు ఎండ్‌కార్డ్...! వాటి స్థానంలో పవర్‌ఫుల్..!
Comments
Please login to add a commentAdd a comment