చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'షావోమీ' మరో సిరీస్ 'షావోమీ 12' స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనుంది. త్వరలోనే విడుదల కానున్న ఈఫోన్ ఫీచర్లు ప్రస్తుతం చైనాలో లీకయ్యాయి. లీకైన వివరాల ఆధారంగా ఈ ఫోన్‌లు స్నాప్ డ్రాగన్ 870 ఫ్లాట్ ఫాం ఆధారంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫోన్ సిరీస్‌లు ఏమై ఉంటాయనే విషయంపై షావోమీ అధికారికంగా ప్రకటించకపోయినా.. మార్కెట్ పండితులు అభిప్రాయం ప్రకారం..లీకైన స్నాప్ డ్రాగన్ 870 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రెండు ఫోన్‌లలో ఒకటి రెడ్ మీ, మరొకటి షావోమీ అని తెలుస్తోంది.
షావోమీ, రెడ్‌మీ ఫీచర్లు
షావోమీ విడుదల చేసే కొన్ని వెర్షన్ లు హై ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. దీన్ని బట్టి లీకైన ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 870, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నిక్‌లలో 67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 33డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నాయి.
కెమెరాల విషయానికొస్తే 108 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెన్సార్, హార్మోన్ కార్డాన్ స్పీకర్లు, ఎక్స్ -యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ ఉంటుందని భావిస్తున్నారు.మరోవైపు, రెడ్‌మి వెర్షన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 చిప్, 6.6 అంగుళాల ఫ్లాట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment