షావోమి నుంచి మరో లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ | Xiaomi 11 Lite 5G NE Launch Teased For September 15 | Sakshi
Sakshi News home page

Xiaomi : షావోమి నుంచి మరో లైట్‌ స్మార్ట్‌ఫోన్‌

Published Mon, Sep 13 2021 8:23 PM | Last Updated on Mon, Sep 13 2021 8:29 PM

Xiaomi 11 Lite 5G NE Launch Teased For September 15 - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి ఎమ్‌ఐ 11 లైట్‌ను ఈ ఏడాది జూన్‌ 22న లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా షావోమీ 11 లైట్‌ సిరీస్‌లో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయనుంది. న్యూ షావోమీ 11 లైట్‌ 5జీ ఎన్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 15న లాంచ్‌ చేస్తున్నట్లు షావోమీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎమ్‌ఐ లైట్‌ 11తో సమానమైన స్పెసిఫికేషన్స్‌తో పనిచేస్తోందనే ఊహగానాలు వస్తున్నాయి.  

చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఇదే..!

షావోమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో షావోమీ 11 లైట్‌ 5జీ ఎన్‌ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా షావోమీ 11టీ, షావోమీ 11 టీ ప్రో స్మార్ట్‌ఫోన్లను టీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో షావోమీ 11 లైట్‌ 5జీఎన్‌ఈ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. షావోమీ 11 లైట్‌ 5జీ ఎన్‌ఈ ధర సుమారు రూ. 28,600గా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

షావోమీ 11 లైట్‌ 5జీఎన్‌ఈ స్పెసిఫికేషన్లు అంచనా..

  • 6.55 అంగుళాల హెచ్‌డీ+అమోల్డ్‌ హోల్‌పంచ్‌ డిస్‌ప్లే
  • ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
  • 20 మెగాపిక్సెల్‌ ప్రంట్‌ కెమెరా 
  • క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 778జీ  ప్రాసెసర్‌
  • 33వాట్ రాపిడ్ ఛార్జింగ్
  • 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ

చదవండి: Xiaomi: ఆయా దేశాల్లో స్మార్ట్‌ఫోన్లను బ్లాక్‌ చేసిన షావోమీ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement