దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'షావోమీ' (Xiaomi) 13 ప్రో 5జీ మొబైల్ ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో విడుదలైంది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ఇప్పుడు భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంది.
క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించే ఈ మొబైల్ ఫ్లాగ్‍షిప్ కెమెరాలతో కూడా లభిస్తుంది. షావోమీ కొత్త మొబైల్ వైర్‌లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,820mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ వైర్డ్ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‍కు, 50 వాట్స్ వైర్‌లెస్ టర్బో ఫాస్ట్ చార్జింగ్, 10 వాట్ల వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.
షావోమీ 13 ప్రో మొబైల్‍లో డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‍సీ, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా పొందింది. కెమెరాలు కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించవచ్చు.
(ఇదీ చదవండి: తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!)
షావోమీ 13 ప్రో మొబైల్ లో పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 5జీ ప్రాసెసర్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ఆడియో, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6.73 ఇంచెస్ 2K+ రెజల్యూషన్ LTPO 3.0 అమోలెడ్ డిస్‍ప్లే ఉంటుంది. ఇది ఏకంగా 1,900 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ పొందుతుంది. డిస్‍ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
షావోమీ తన కొత్త 13 ప్రో మొబైల్ విడుదల చేసింది. అయితే ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ ఈ మొబైల్ ధరలను ఫిబ్రవరి 28న వెల్లడించనుంది. ఇది మొబైల్ సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఈ మొబైల్ ధర 4,999 యువాన్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 61,000.
Comments
Please login to add a commentAdd a comment