xiaomi mobiles
-
Xiaomi 13 Pro: దేశీయ మార్కెట్లో విడుదలైంది, కానీ..
దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'షావోమీ' (Xiaomi) 13 ప్రో 5జీ మొబైల్ ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో విడుదలైంది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ఇప్పుడు భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించే ఈ మొబైల్ ఫ్లాగ్షిప్ కెమెరాలతో కూడా లభిస్తుంది. షావోమీ కొత్త మొబైల్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,820mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ వైర్డ్ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్కు, 50 వాట్స్ వైర్లెస్ టర్బో ఫాస్ట్ చార్జింగ్, 10 వాట్ల వైర్లెస్ రివర్స్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. షావోమీ 13 ప్రో మొబైల్లో డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా పొందింది. కెమెరాలు కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించవచ్చు. (ఇదీ చదవండి: తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!) షావోమీ 13 ప్రో మొబైల్ లో పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 5జీ ప్రాసెసర్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ఆడియో, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6.73 ఇంచెస్ 2K+ రెజల్యూషన్ LTPO 3.0 అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఏకంగా 1,900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. షావోమీ తన కొత్త 13 ప్రో మొబైల్ విడుదల చేసింది. అయితే ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ ఈ మొబైల్ ధరలను ఫిబ్రవరి 28న వెల్లడించనుంది. ఇది మొబైల్ సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఈ మొబైల్ ధర 4,999 యువాన్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 61,000. -
బడ్జెట్ ధరలో.. అదిరే ఫీచర్లతో రెడ్మీ కొత్త ఫోన్!
కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని మహమ్మారిని ఏం చేయలేకపోయింది. దీంతో గతేడాది దేశీయ మార్కెట్లో సుమారు 2లక్షల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 24శాతం వాటాతో భారత్‌లో టాప్ బ్రాండ్‌గా ఉన్న షావోమీ వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. తాజాగా షావోమీ రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. హోలీ సందర్భంగా మర్చి 17న దేశీయ మార్కెట్లో రూ.15వేల బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త ఫోన్ అమ్మకాలు ప్రారంభిస్తామని షావోమీ ప్రతినిధులు ప్రకటించారు. రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ►స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓఎస్ ప్రాసెసర్ ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ►ఫోన్ ముందు పై భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ►50ఎంపీ మెయిన్ కెమరా సెన్సార్లు ►మ్యాక్రో ఫోటో గ్రఫీ కోసం 2ఎంపీ సెన్సార్లు చదవండి: ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్!! -
లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర
మొబైల్ ఫోన్ కొనాలనుకునే వారికి పోకో గుడ్ న్యూస్ తెలిపింది. పోకో ఎక్స్ 3 ప్రో మోడల్ ను మార్చి 30న ఇండియాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లేతో పాటు ఎల్ సీడి స్క్రీన్ ను కలిగి ఉంది. 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ సాప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది. పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్(అంచనా) 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 48ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా 20ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్ 5260ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.25,500 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.23,500 చదవండి: ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్ బైక్ విడుదల -
లీకైన రెడ్మీ నోట్ 10 సిరీస్ ధర, చిత్రాలు
రెడ్మీ నోట్ 10 సిరీస్ మొబైల్ రేపు (మార్చి 4) మనదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లో మూడు ఫోన్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రీమియం రేంజిలో రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్, మిడ్-రేంజ్ లో రెడ్మీ నోట్ 10 ప్రో, బడ్జెట్ రేంజిలో వనిల్లా రెడ్మీ నోట్ 10 తీసుకోని రావొచ్చు. అయితే విడుదలకు ఒక రోజు ముందు రెడ్మీ నోట్ 10 సిరీస్ లాంచ్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో ధర లీకైంది. రెడ్మీ నోట్ 10 భారతదేశం ధర ఆన్లైన్లో లీక్ కాగా, రెడ్మీ నోట్ 10 ప్రో గ్లోబల్ లాంచ్ ధర కూడా బయటకు వచ్చేసింది. యూట్యూబర్ సిస్టెక్ బన్నా ఒక వీడియోలో రెడ్మీ నోట్ 10 ధరతో పాటు రిటైల్ బాక్స్ చిత్రాన్ని లీక్ చేశారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.15,999గా ఉంది. అయితే, సాధారణంగా రిటైల్ బాక్స్ ధర కంటే ఫోన్ సేల్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఇంకా తక్కువ ధర కలిగిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్.. 6జీబీ + 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గ్లోబల్ రెడ్మీ లాంచ్ ధర 279 యూరోలుగా(సుమారు రూ.20,400) ఉండే అవకాశం ఉందని తెలిపారు. గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు తీసుకోని రానున్నారు. వీటి ధర లీక్ చేయలేదు. రెడ్మి నోట్ 10 ప్రో మొబైల్ డార్క్ నైట్, గ్లేసియర్ బ్లూ, గ్రాడియంట్ బ్రాంజ్, వింటేజ్ బ్రాంజ్, ఓనిక్స్ గ్రే రంగుల్లో తీసుకోని రావచ్చు. అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉన్న ఫోన్ రెడ్ మీ ఈ ధరలోనే అందిస్తూ ఉండటం విశేషం. ఇందులో 120 హెర్ట్జ్ ఐపీఎస్ డిస్ ప్లే, బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్ ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం. చదవండి: గ్రాహంబెల్ జయంతి: టెలిఫోన్లలో ఎన్ని రకాలొచ్చాయి? భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం -
షియోమీ మరో అద్భుత ఆవిష్కరణ
మొబైల్ కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం రోజుకో టెక్నాలజీని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తుండగా.. ఎల్జీ, ఒప్పో వంటి ఇతర కంపెనీలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. మొబైల్ మార్కెట్ లో పోటీని తట్టుకునేందుకు షియోమీ కూడా మరో కొత్త టెక్నాలజీ మొబైల్ ని తీసుకురాబోతుంది. తాజాగా షావోమి సరౌండ్ డిస్ప్లే, పాప్-అప్ కెమెరా తో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతుంది. వీటికి సంబంధించిన డిజైన్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంఐ మిక్స్ ఆల్ఫా పేరుతో దీనిని మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు.(చదవండి: ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్) షియోమీ కాన్సెప్ట్ ఫోన్ పేటెంట్ లను లెట్స్‌గో డిజిటల్ టెక్ సంస్థ విడుదల చేసింది. షియోమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ మేధో సంపత్తి కార్యాలయంలో భాగమైన ది హేగ్ బులెటిన్‌తో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2020 డిసెంబర్ 18న స్మార్ట్‌ఫోన్ యొక్క 16 స్కెచ్‌లు బయటకి వచ్చాయి. ఈ 16 స్కెచ్లలో మొబైల్ ఫుల్ 360 డిగ్రీల ర్యాపారౌండ్ డిస్ప్లే కలిగి ఉంది. దీనితో పాటు పాప్-అప్ ఫీచర్‌తో ట్రిపుల్ కెమెరా, డ్యూయల్-ఎల్ఈడీ ఫ్లాష్ లైట్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మొబైల్ పై భాగంలో పవర్ బటన్, సెకండరీ మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్ దిగువ భాగంలో స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ తో పనిచేయనున్నట్లు సమాచారం. దీనిని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకువస్తారో అనే దానిపై ఇంకా సమాచారం లేదు. -
రూ.70 లక్షల రెడ్ మీ ఫోన్లు గోవిందా!
గుంటూరు: చిత్తూరు జిల్లా నగరిలో మొబైల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం మరువకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. గుంటూరు-కోల్‌కత హైవే (ఎన్‌హెచ్-16)పై బుధవారం భారీ చోరీ జరిగింది. శ్రీసిటీ నుంచి కోల్‌కత వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో రూ.70 లక్షల విలువైన రెడ్ మీ ఫోన్లను దుండగులు అపహరించారు. తన లారీలో దొంగతనం జరిగిందని గుర్తించిన డ్రైవర్ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇదిలాఉండగా. తమిళనాడులోని శ్రీపెరంబూర్ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో గత ఆగస్టు 26న దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. కంటైనర్ ఆంధ్రా బార్డర్ నగరి వద్దకు రాగానే లారీని అడ్డం పెట్టిన దుండగులు.. డ్రైవర్‌ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. (చదవండి: సినీ ఫక్కీలో కంటైనర్ లూటీ) -
రెడ్మి నోట్ 5 ప్రొ.. భారీ ఆఫర్
రెడ్మి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షావోమి ఆశ్చర్యకర ఆఫర్ ప్రకటించింది. పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ ధరపై 3 వేల రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్తగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 2018 సంవత్సరానికి సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రకటించిన టెక్, ఆటో అవార్డుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ ‘బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. అవార్డు వచ్చిన సందర్భంగా సర్ప్రైజ్ ఆఫర్ ప్రకటిస్తున్నట్టు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మానుకుమార్ జైన్ తెలిపారు. ఎంఐ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్సైట్లలో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందనేది ఆయన వెల్లడించలేదు. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న స్మార్ట్‌ఫోన్
ముంబై : స్మార్ట్ఫోన్ల యుగంలో రోజుకోక కొత్త ఫీచర్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పోటీని తట్టుకునేందుకు ప్రతి కంపెనీ కొత్త ఫీచర్లతో నెలకొక స్టార్మ్‌ఫోన్‌ని లాంచ్ చేస్తోంది. వీటిలో కొన్ని హై బడ్జెట్ ఫోన్లు కాగా మరి కొన్ని మాత్రం సామాన్యులకు అందుబాటులో ఎక్కువ ఫీచర్స్‌తో.. తక్కువ ధరలోనే వస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు.. అన్ని ఫీచర్లతో బడ్జెట్ ధరలో అంటే 10 - 15 వేల రూపాయల మధ్య లభించే స్మార్ట్‌ఫోన్‌కే తమ ఓటు అంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తుతున్నాయి. మధ్యస్థాయి వినియోగదారుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్‌గా షావోమీ ఫోన్లు ముందు వరుసలో నిలిచాయంటున్నారు నిపుణులు. ‘కన్జ్యూమర్ లెన్స్’ నిర్వహించిన సర్వేలో ‘షావోమీ’ భారతీయుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్‌గా నిలిచింది. తరువాతి వరుసలో శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లున్నాయి. ఎక్కువ మంది మొదటిసారి కొన్న స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. రెండోసారి, మూడోసారి మాత్రం ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కోనేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అయితే స్మార్ట్ఫోన్లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటుండగా.. ఐదుగురిలో నలుగరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌తోనే అడ్జస్ట్ అవుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. అంతేకాక 25 - 40 వేల రూపాయల మధ్య ఫోన్ కొనాలని భావించే వాళ్లు ఎక్కువగా వన్‌ప్లస్ బ్రాండ్‌ను ప్రిఫర్ చేస్తున్నట్లు తెలిసింది. ఒప్పో, వివో, ఆపిల్, హనర్ వంటి హై బడ్జెట్ బ్రాండెడ్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ వన్‌ప్లస్ ముందు వరుసలో ఉంది. -
బడ్జెట్ ధరలో రెడ్మి స్మార్ట్ఫోన్లు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి మరో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా బడ్జెట్ ధరల్లో రెడ్మి సిరీస్ స్మార్ట్ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. రెడ్మి 6, 6ఏ, 6 ప్రో పేరుతో మూడు డివైస్‌లను అక్కడి మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మి 6 పలు వేరియంట్లలో, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో లాంచ్ చేసింది. 3జీబీ/32జీబీ వేరియంట్ ధరను సుమారు రూ. 8,500, 4జీబీ/64జీబీ రూ. 10,500, 6జీబీ స్టోరేజ్ వేరియంట్ సుమారు 11వేల రూపాయలకు లభ్యం. మిగిలిన డివైస్ల వివరాలు లాంచింగ్ తరువాత లభ్యం. రెడ్ మి 6 ఫీచర్లు 5.45 అంగుళాల డిస్ప్లే 720 x 1440 రిజల్యూషన్ హీలియో పీ 22 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 12+5ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షావోమీదే..
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి ఆధిపత్యం కొనసాగుతోంది. 2018 తొలి త్రైమాసికంలో 30.3 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 25.1 శాతం వాటాతో శాంసంగ్ రెండో స్థానానికి పరిమితం కాగా... 7.4 శాతం వాటాతో ఒప్పో మూడో స్థానంలో, 6.7 శాతంతో వివో 4వ స్థానంలో నిలిచాయి. ట్రాన్సిషన్ గ్రూప్ 4.6 శాతం వాటాతో 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ట్రాన్షిషన్‌కు ఐటెల్, టెక్నో, ఇన్ఫినిక్స్, స్పైస్ అనే నాలుగు బ్రాండ్లున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. త్రైమాసికం పరంగా చూస్తే 4జీ ఫీచర్ ఫోన్ మార్కెట్లో 50 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యింది. దీనికి రిలయన్స్ జియోఫోన్ ప్రధాన కారణం. ఫీచర్ ఫోన్ మార్కెట్లో జియో 38.4 శాతం మార్కెట్ వాటాతో టాప్‌లో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (10.4 శాతం), ట్రాన్సిషన్ (7.9 శాతం), లావా (6 శాతం), మైక్రోమ్యాక్స్ (4.7 శాతం) ఉన్నాయి. 2018 తొలి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 3 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి నమోదయ్యింది. -
భారత్‌కు షియోమి స్మార్ట్ టీవీలు త్వరలో...
- ఇతర ఉపకరణాలు కూడా దశలవారీగా ప్రవేశపెడతాం - షియోమి ఇండియా హెడ్ మను హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ షియోమి మొబైల్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను భారత్‌కు తీసుకొస్తోంది. స్మార్ట్ టీవీ, హెడ్‌ఫోన్స్, 1 టీబీ నుంచి 6 టీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్‌తో కూడిన వైఫై రౌటర్స్, కెమెరాలను ఇతర దేశాల్లో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఎంఐ బ్యాండ్ ఫిట్నెస్ ట్రాకర్‌తోపాటు పవర్ బ్యాంక్స్, ఎల్ఈడీ లైట్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. ఈ ఏడాదే ఎంఐ బాక్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఇది స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్. సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మలుస్తుంది. ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. స్మార్ట్ టీవీ ఈ ఏడాది చివరికి లేదా 2016 ప్రారంభంలో తీసుకొస్తామని షియోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇక 5.7 అంగుళాల ఎంఐ నోట్ కొద్ది రోజుల్లో విడుదల చేస్తామన్నారు. ఇతర వ్యయాలను గణనీయంగా తగ్గించడంతోపాటు ఆన్లైన్లో విక్రయిస్తున్న కారణంగా ఉత్పత్తులను అతి తక్కువ ధరలో అందించే వీలైందన్నారు. తయారీ ఈ ఏడాదే..: బెంగళూరులో ఆర్అండ్డీ కేంద్రాన్ని షియోమి ఏర్పాటు చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఈ కేంద్రంలో నూతన మొబైల్స్‌కు డిజైన్ చేస్తామని మను కుమార్ తెలిపారు. తయారీ ప్లాంటు ఏర్పాటు ఈ ఏడాదే కార్యరూపంలోకి వస్తుందన్నారు. 2014 జూలై చివర్లో భారత్‌లో అడుగు పెట్టామని, తొలి నాలుగు నెలల్లో 10 లక్షలకుపైగా ఫోన్లను విక్రయించామని పేర్కొన్నారు. ఐడీసీ తాజా గణాంకాల ప్రకారం షియోమి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 4% వాటాతో 5వ స్థానంలో ఉందన్నారు. షియోమికి ఫోన్లను సరఫరా చేస్తున్న రెండు ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. శ్రీసిటీ ప్లాంటులో షియోమికి రోజుకు 10,000 ఫోన్లను ఫాక్స్‌కాన్ తయారు చేయనుందని వస్తున్న వార్తలను ఆయన ధ్రువీకరించలేదు.