ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మరి కొద్ది రోజుల్లో 5జీ రెడ్‌మీ నోట్ 11టీ' ను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా రెడ్ మీ 11టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' అంటూ అభివర్ణించింది. దీంతో రెడ్ మీ నోట్ 11టీ ధర, ఫీచర్లు, స్పెసికేషన్‌లు గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
రెడ్ మీ నోట్ 11టీ ఫీచర్లు, ధరలు
రెడ్ మీ నోట్ 11తరహాలో రెడ్ మీ నోట్ 11టీ మీడియా టెక్ డైమెన్సిటీ 810తో అందుబాటులో ఉంది. రియల్ మీ 8ఎస్ కాన్ఫిగరేషన్‌ల లాగే 6జీబీ ర్యామ్ 128జీబీ, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఎంట్రీ లెవల్ కాన్ఫిగరేషన్ లలో వస్తున్న ఫోన్ ధర రూ. 17,999 ఉండగా టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.
రెడ్ మీ నోట్ 11టీ అంత స్పెషల్ ఎందుకో?
నవంబర్ 30న విడుదల కానున్న5జీ రెడ్‌మీ నోట్ 11టీ' పై నెట్టింట్లో వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షావోమీ సంస్థ స్పందిస్తూ.. రెడ్‌మీ నోట్ 11 రీ బాండ్రే ఈ రెడ్‌మీ నోట్ 11టీ స్మార్ట్ ఫోన్ అని తెలిపింది. కానీ ఇది స్విఫ్ట్‌డిస్‌ప్లే, స్పీడ్ ఛార్జింగ్, ర్యామ్ బూస్టర్ వంటి ఫీచర్లు ఉన్న 'నెక్ట్స్ జెనరేషన్ రేసర్' ఫోన్ అని తెలిపింది.
రెడ్ మీ 11 ప్రో సిరీస్‌తో పాటే విడుదల
షావోమీ సంస్థ నవంబర్ 30న రెడ్ మీ నోట్ 11 సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్ మీ నోట్ 11ప్రో, రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ తో పాటే రెడ్ మీ నోట్ 11టీ'ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
రెడ్ మీ నోట్ 11ధరలు
చైనాలో రెడ్ మీ నోట్ 11టీ 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.14,000 ఉండగా... 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.15,200, 8జీబీ ర్యామ్ స్టోరేజ్ ఫోన్ ధర 17,500, 8జీబీ ర్యామ్ 256స్టోరేజ్ ఫోన్ ధర రూ.19,900గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment