ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్‌మీ సిరీస్‌లో భాగంగా మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. రెడ్‌మీ 9 కు తదనంతర ఫోన్‌గా రెడ్‌మీ 10 ను షావోమీ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. కాగా విడుదలకు ముందే రెడ్‌మీ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫీకేషన్లు ఎమ్‌ఐ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. కాగా ఈఫోన్ రివర్స్ బ్యాటరీ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ నెల చివర్లో షావోమీ రెడ్‌మీ 10 భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెడ్‌మీ 10 మూడు స్టోరేజ్ వేరియంట్లతో రానుంది. 4జీబీ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లతో రానుంది. రెడ్‌మీ 10 కార్బన్ గ్రే, పెబ్బల్ వైట్, సీ బ్లూ కలర్స్‌లో ఉండనుంది. రెడ్‌మీ 10 ఫోన్ ధరలను షావోమీ ప్రకటించలేదు. స్మార్ట్‌ఫోన్ నిపుణుల ప్రకారం..రెడ్‌మీ 10 ప్రారంభ ధర రూ.8,999 నుంచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
రెడ్‌మీ 10 ఫీచర్లు
- డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్
- ఆండ్రాయిడ్ 11 MIUI 12.5
- 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) డాట్ డిస్‌ప్లే
- ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ88 ఎస్‌ఓసీ
- 50 ఎమ్‌పీ రియర్ కెమెరా
- 8 ఎమ్‌పీ ఫ్రంట్ కెమెరా
- 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
- 18w ఫాస్ట్ ఛార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment