స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్ మన నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, హెడ్ ఫోన్స్‌కు వేరవేరుగా బ్యాటరీ ఛార్జర్లను మనతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లి మనం క్యారీ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు ఛార్జర్లు మర్చిపోయామంటే అంతే సంగతులు.. తిరిగి దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్‌కు వెళ్లి కొత్తది కొనుకోవాల్సిందే. మనలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే..
తాజాగా షావోమి రిలీజ్ చేసిన ఛార్జర్‌తో వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చును. షావోమి మార్కెట్‌లోకి 67W సోనిక్‌ఛార్జ్ 3.0 ను సోమవారం రోజున మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. షావోమి రిలీజ్ చేసిన కొత్త ఛార్జర్ యుఎస్‌బీ టైప్-ఎ నుంచి యుఎస్‌బీ టైప్-సి సపోర్ట్ చేయనుంది. కాగా ఛార్జర్‌లో ఒకే యుఎస్‌బి టైప్-ఎ పోర్ట్ ఉండడం గమనార్హం, కానీ షావోమి ఈ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు , మరెన్నో పలు పరికరాలను ఛార్జ్ చేయగలదని షావోమి పేర్కొంది.
ఛార్జర్ అనేక పరికరాలను వేగంగా ఛార్జ్ చేయడానికి 67W అవుట్‌పుట్‌ను అందిస్తుంది.షావోమి ఈ ఏడాది ప్రారంభంలో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ ఎంఐ 11 అల్ట్రాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌కు 55W ఫాస్ట్ ఛార్జర్‌ను కొనుగోలుదారులకు షావోమీ అందిస్తోంది. షావోమి సోనిక్‌ఛార్జ్ 3.0 క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0తో వస్తోంది.
భారత్‌లో ఎంఐ 67W సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ధర రూ .1,999 గా నిర్ణయించారు. ఈ ఛార్జర్‌ను షావోమి అధికారిక వెబ్‌సైట్ నుంచి, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఛార్జర్‌కు 100 సెం.మీ 6A టైప్-సీ కేబుల్‌తో రానుంది.
Mi 67W SonicCharge 3.0 Charger Combo#Mi67WCharger #SonicCharge3
— Mi India (@XiaomiIndia) July 12, 2021
Sale Starts Today at 12PM - https://t.co/Sb9Dw2mkHN
Available on https://t.co/D3b3QtmvaT, Mi Home and Offline Stores. pic.twitter.com/N9WO1HsuVn
Comments
Please login to add a commentAdd a comment