ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రాకతో పాఠశాలలు, ఆఫీసులు పూర్తిగా క్లోజ్ అవ్వడంతో పిల్లలకు ఆన్‌లైన్ క్లాస్‌లు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమయ్యారు. దీంతో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ కొనుగోళ్లలో భారీగా వృద్ధి చెందింది. ల్యాప్‌టాప్స్ కొనుగోలు గణనీయంగా పెరగడంతో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లపై దృష్టి సారించాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్లల తయారీదారు షావోమీ కూడా ల్యాప్‌టాప్ ఉత్పత్తి రేసులో ముందు నిలుస్తోంది.
తాజాగా షావోమీ రెడ్‌మీబుక్ 15 పేరిట మరో ల్యాప్‌టాప్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 3 న భారత మార్కెట్లలోకి లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్‌మీబుక్ 11th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. రెడ్‌మీబుక్ 15 ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌లు ఏసర్ స్విఫ్ట్ 3, ఆసుస్ వివోబుక్ తో పోటీ పడనున్నట్లుగా తెలుస్తోంది. రెడ్‌మీబుక్ ధర రూ. 50 వేల దిగువ ఉండొచ్చునని టెక్ ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు.
రెడ్‌మీబుక్ 15 ఫీచర్లు
- 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
- 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 అండ్ i5 ప్రొసెసర్
- 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నట్ స్టోరేజ్, 516 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ విత్ విండోస్ 10.
- డ్యూయల్ బ్యాడ్ వైఫై, బ్లూటూత్ వర్షన్ 5.0
- యూఎస్‌బీ 3.1 టైప్ సీ, యూఎస్‌బీ టైప్-ఏ, యూఎస్‌బీ 2.0, హెచ్‌డీఏమ్‌ఐ, ఆడియోజాక్ పోర్ట్.
- 65w ఛార్జర్.
Comments
Please login to add a commentAdd a comment