Xiaomi Mi Pad 5 & 5 Pro Price, Specifications And Features Details Here - Sakshi
Sakshi News home page

అదిరే ఫీచర్లతో షావోమి పాడ్‌ 5,షావోమి పాడ్‌ 5 ప్రో

Published Wed, Aug 11 2021 2:49 PM | Last Updated on Wed, Aug 11 2021 3:19 PM

Xiaomi Mi Pad 5, Mi Pad 5 Pro Price, Specifications details here - Sakshi

చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది.  స్మార్ట్ ఫోన్ల సేల్స్ పరంగా నెంబర్ వన్‌ స్థానంలో ఉన్న షావోమి మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు వరుసగా గాడ్జెట్స్‌ను రిలీజ్‌ చేస్తోంది. తాజాగా షావోమికి చెందిన షావోమి పాడ్‌ 5, షావోమి పాడ్‌ 5 ప్రోలను విడుదల చేసింది. 

షావోమి పాడ్‌ 5,షావోమి పాడ్‌ 5 ప్రో స్పెసిఫికేషన్లు

షావోమి పాడ్‌ 5,షావోమి పాడ్‌ 5 ప్రో ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. షోవోమి పాడ్‌ 511అంగుళాల ఎల్‌ సీడీ, 2560*1600 స్క్రీన్‌ రెజెల్యూషన్‌ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ట్రూ టోన్‌,ట్రూ టోన్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్‌ 10, 500నైట్స్‌ బ్రైట్‌ నెస్‌తో వస్తుండగా.. డివైజ్‌లకు వెనక భాగంలో డ్యూయల్‌ కెమెరా సెటప్‌, పాడ్‌5 సిరీస్‌ (వైఫై)లో 13ఎంపీ ప్రైమరీ కెమోరా, 8 ఎంపీ సెకండరీ సెన్సార్‌లు ఉన్నాయి. షావోమి పాడ్‌ 5 ప్రో  5జీ మోడల్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా13ఎంపీ సెకండరీ సెన్సార్ లతో పాటు  సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం ముందు భాగంలో 5ఎంపీ కెమోరా, క్వాడ్ స్పీకర్  8 స్పీకర్ సిస్టమ్ ఉంది.

షావోమి పాడ్‌ 5లో స్నాప్‌ డ్రాగన్‌ 860చిప్‌ సెట్‌, 8,720 ఏఎంహెచ్‌ బ్యాటరీతో వస్తుండగా ప్రో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్ ఉంది. దీంతో పాటు 8,600 ఏఎంహెచ్‌ బ్యాటరీ సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఈ రెండు వేరియంట్లు 67డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 33డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇక ఆండ్రాయిడ్‌ 11 ఆధారంగా ఎంఐయూఐ 12.5 ని రన్ చేసుకోవచ్చు. వైఫై, బ్లూటూత్ 5.2, టైప్-సి యూఎస్‌బీ పోర్ట్‌తో వస్తాయి.

షావోమి పాడ్‌ 5,షావోమి పాడ్‌ 5 ప్రో ధరలు  
షావోమి ప్యాడ్ 5 రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 6జీబీ ర్యామ్‌128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 22,900కే అందుబాటులో ఉంది. 6జీబీ + 256జీబీ ధర సుమారు రూ. 26,400 ఉండగా..వైట్‌,బ్లాక్‌, ఎల్లో కలర్స్‌ తో వస్తుంది. షావోమీ ప్యాడ్‌ 5 ప్రో ధర 6జీబీ+128జీబీ వేరియంట్  ధర రూ. సుమారు రూ. 28,700గా ఉండగా 5G వేరియంట్ ధర సుమారు రూ. 40,200గా ఉండగా 8జీబీ ర్యామ్‌ 256జీబీ స్టోరేజ్‌ తో బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్స్‌ తో అందుబాటులోకి వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement