Xiaomi Mi 5
-
అదిరే ఫీచర్లతో షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో
చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. స్మార్ట్ ఫోన్ల సేల్స్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న షావోమి మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు వరుసగా గాడ్జెట్స్‌ను రిలీజ్ చేస్తోంది. తాజాగా షావోమికి చెందిన షావోమి పాడ్ 5, షావోమి పాడ్ 5 ప్రోలను విడుదల చేసింది. షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో స్పెసిఫికేషన్లు షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. షోవోమి పాడ్ 511అంగుళాల ఎల్ సీడీ, 2560*1600 స్క్రీన్ రెజెల్యూషన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ట్రూ టోన్,ట్రూ టోన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10, 500నైట్స్ బ్రైట్ నెస్‌తో వస్తుండగా.. డివైజ్‌లకు వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, పాడ్5 సిరీస్ (వైఫై)లో 13ఎంపీ ప్రైమరీ కెమోరా, 8 ఎంపీ సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. షావోమి పాడ్ 5 ప్రో 5జీ మోడల్లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా13ఎంపీ సెకండరీ సెన్సార్ లతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్ కోసం ముందు భాగంలో 5ఎంపీ కెమోరా, క్వాడ్ స్పీకర్ 8 స్పీకర్ సిస్టమ్ ఉంది. షావోమి పాడ్ 5లో స్నాప్ డ్రాగన్ 860చిప్ సెట్, 8,720 ఏఎంహెచ్ బ్యాటరీతో వస్తుండగా ప్రో మోడల్లో స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్ ఉంది. దీంతో పాటు 8,600 ఏఎంహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ రెండు వేరియంట్లు 67డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 33డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇక ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఎంఐయూఐ 12.5 ని రన్ చేసుకోవచ్చు. వైఫై, బ్లూటూత్ 5.2, టైప్-సి యూఎస్బీ పోర్ట్‌తో వస్తాయి. షావోమి పాడ్ 5,షావోమి పాడ్ 5 ప్రో ధరలు షావోమి ప్యాడ్ 5 రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 6జీబీ ర్యామ్128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 22,900కే అందుబాటులో ఉంది. 6జీబీ + 256జీబీ ధర సుమారు రూ. 26,400 ఉండగా..వైట్,బ్లాక్, ఎల్లో కలర్స్ తో వస్తుంది. షావోమీ ప్యాడ్ 5 ప్రో ధర 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. సుమారు రూ. 28,700గా ఉండగా 5G వేరియంట్ ధర సుమారు రూ. 40,200గా ఉండగా 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ తో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ తో అందుబాటులోకి వచ్చింది. -
'ఎంఐ నోట్ 5' ధర తగ్గిందోచ్!
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమి తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించుకుంది. ఊహించినట్టుగానే షియామి ఎంఐ నోట్ 5 పేరుతో భారత్ లో లాంచ్ అయిన ఈ మొబైల్ ధరను రెండువేల రూపాయలు తగ్గించింది. ఈ మేరకు కంపెనీ ఇండియా హెడ్ మను జైన్ మంగళవారం ట్విట్ చేశారు. ఫ్లిప్ కార్ట్, ఎంఐ. కాం ద్వారా అందుబాటులో వున్న దీని ధరను 22,999 లుగా ప్రకటించింది. గత రెండు సంవత్సరాలలో భారతదేశం లో తమ అమ్మకాలు 72 శాతం పెరిగాయని ప్రకటించిన తర్వాత ఈ తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. మార్చి లో లాంచ్ సందర్బంగా దీని ధరను రూ. 24, 999 గా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 820 క్వాల్కం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 5.5 ఫుల్ హెచ్ డీ స్క్రీన్ (1080x1920 ఎంపీ) 32జీబీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 16 మెగాపిక్సెల్ కెమెరా తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. #Mi5 for Rs. 22,999 ☺️☺️ Starting today, we are announcing a permanent price drop for Mi 5. Buy it from Mi. com and @Flipkart. @XiaomiIndia — Manu Kumar Jain (@manukumarjain) August 23, 2016 -
నేటినుంచి షియోమి ఎంఐ5 ఓపెన్ సేల్
షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ5ను బుధవారం నుంచి మార్కెట్లో ఓపెన్ సేల్కు అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలుదారులు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. ఎంఐ.కామ్ ఆన్లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ అమ్మకాలు కొనసాగుతాయి. ఏప్రిల్ 23 నుంచి రెడ్ ఎంఐ నోట్ 3 ఓపెన్ అమ్మకాలు చేపడుతున్న కంపెనీ, రెడ్ ఎంఐతో పాటు షియోమి ఎంఐ5 ను కూడా బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఎంఐ5 ధర రూ.24,999 కాగా, రెడ్ ఎంఐ నోట్ 3 ధర రూ. 9,999 నుంచి 11,999 వరకు ఉంది. మొత్తం గ్లాస్, మెటల్ డిజైన్ తో తయారుచేసిన ఈ షియోమి ఎంఐ5 స్మార్ట్ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ ఉంటుంది. 3జీబీ ర్యామ్ తో 32జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. 5.15 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ తో సన్ లైట్ డిస్ ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ ను రూపొందించారు. డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 3000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 4 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా దీనిలో ప్రత్యేకతలు.