నేటినుంచి షియోమి ఎంఐ5 ఓపెన్ సేల్ | Xiaomi Mi 5 to be available in open sale on Wednesday | Sakshi
Sakshi News home page

నేటినుంచి షియోమి ఎంఐ5 ఓపెన్ సేల్

Published Wed, Apr 27 2016 12:48 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

నేటినుంచి షియోమి ఎంఐ5 ఓపెన్ సేల్

నేటినుంచి షియోమి ఎంఐ5 ఓపెన్ సేల్

షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ5ను బుధవారం నుంచి మార్కెట్లో ఓపెన్ సేల్‌కు అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలుదారులు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. ఎంఐ.కామ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ అమ్మకాలు కొనసాగుతాయి. ఏప్రిల్ 23 నుంచి రెడ్ ఎంఐ నోట్ 3 ఓపెన్ అమ్మకాలు చేపడుతున్న కంపెనీ, రెడ్‌ ఎంఐతో పాటు షియోమి ఎంఐ5 ను కూడా బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.


ఎంఐ5 ధర రూ.24,999 కాగా, రెడ్ ఎంఐ నోట్ 3 ధర రూ. 9,999 నుంచి 11,999 వరకు ఉంది. మొత్తం గ్లాస్, మెటల్ డిజైన్ తో తయారుచేసిన ఈ షియోమి ఎంఐ5 స్మార్ట్ ఫోన్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ ఉంటుంది. 3జీబీ ర్యామ్ తో 32జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. 5.15 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్ తో సన్ లైట్ డిస్ ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ ను రూపొందించారు. డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 3000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 4 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా దీనిలో ప్రత్యేకతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement