open sale
-
టెలివిజన్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు మరికాస్త సమయం కావాలని గతేడాది పరిశ్రమ కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 దాకా కస్టమ్స్ సుంకం నుంచి కేంద్రం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి. ఈ గడువు తీరిపోతుండటంతో అక్టోబర్ 1 నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, సుంకం విధింపుతో టీవీల ధరలు దాదాపు 4 శాతం దాకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 32 అంగుళాల టీవీల రేట్లు రూ. 600 మేర, 42 అంగుళాల టీవీ రేటు రూ. 1,200–1,500 దాకా పెరుగుతాయని పేర్కొన్నాయి. అయితే, ఓపెన్ సెల్ ప్రాథమిక ధరను బట్టి చూస్తే దిగుమతి సుంకం భారం రూ. 150–250కి మించదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఓపెన్ సెల్ వంటి కీలకమైన ఉత్పత్తులను ఎల్లకాలం దిగుమతి చేసుకుంటూ ఉంటే దేశీయంగా టీవీల తయారీ రంగం ఎదగలేదని పేర్కొన్నాయి. ఇలాంటి వాటిని దేశీయంగా తయారు చేయడానికి సుంకం విధింపు తోడ్పడగలదని వివరించాయి. -
జియో దివాలీ ధమాకా ఆఫర్
సాక్షి, ముంబై: దీపావళి పండుగ సందర్భంగా జియో ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. భారీ అమ్మకాలతో సునామీ సృష్టించిన జియో ఫోన్ 2ను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. తొలిసారిగా జియోఫోన్ ఓపెన్ సేల్‌ను ప్రారంభించింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ ఫోన్‌కు ఓపెన్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు జియో తెలిపింది. ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన తరువాత ఓపెన్ సేల్ నిర్వహించడం ఇదే తొలిసారి. నవంబరు 5వతేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి మొదలైన ఈ ధమాకా సేల్ నవంబర్ 12న ముగుస్తుంది. అలాగే పేటీఎం ద్వారా ఫోన్ కొనుగోలు చేసినవారికి 2వందల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. జియో ఫోన్ 2 ఫీచర్లు 2.4 ఇంచ్ డిస్ప్లే 512 ఎంబీ ర్యామ్ 4 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 2 ఎంపీ రియర్ కెమెరా వీజీఏ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: 2999 రూపాయలు -
లెనోవో 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలు నేటినుంచే
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలను సోమవారం నుంచి ప్రారంభించింది. ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట ఫోన్ ను తొలిసారి ఓపెన్ అమ్మకాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో ఆసక్తి వున్న వినియోగదారులు, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి అవసరం లేకుండానే అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.6,999 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. ఎల్టీఈ క్యాట్ 4 మద్దతుతో 150యంబీసీఎస్ డౌప్ లోడ్ వేగం, 50యంబీపీఎస్ అప్ లోడ్ వేగంతో పనిచేస్తుంది. ఇప్పటికే లక్ష మొబైళ్ల అమ్మకాలు చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఇండియాలో తమకు వైబ్ కె5 మంచి ఆదరణ లభిస్తోందని లెనోవా ఇండియా తెలిపింది. లెనోవో వైబ్ కె5 ఫీచర్లు... 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 4జీ 13 మెగాపిక్సెల్, రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2750 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 గంటల టాక్ టైమ్ 150 గ్రాముల బరువు -
నేటినుంచి షియోమి ఎంఐ5 ఓపెన్ సేల్
షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ5ను బుధవారం నుంచి మార్కెట్లో ఓపెన్ సేల్కు అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలుదారులు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. ఎంఐ.కామ్ ఆన్లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ అమ్మకాలు కొనసాగుతాయి. ఏప్రిల్ 23 నుంచి రెడ్ ఎంఐ నోట్ 3 ఓపెన్ అమ్మకాలు చేపడుతున్న కంపెనీ, రెడ్ ఎంఐతో పాటు షియోమి ఎంఐ5 ను కూడా బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఎంఐ5 ధర రూ.24,999 కాగా, రెడ్ ఎంఐ నోట్ 3 ధర రూ. 9,999 నుంచి 11,999 వరకు ఉంది. మొత్తం గ్లాస్, మెటల్ డిజైన్ తో తయారుచేసిన ఈ షియోమి ఎంఐ5 స్మార్ట్ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ ఉంటుంది. 3జీబీ ర్యామ్ తో 32జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. 5.15 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ తో సన్ లైట్ డిస్ ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ ను రూపొందించారు. డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 3000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 4 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా దీనిలో ప్రత్యేకతలు. -
ఓపెన్ సేల్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎల్ఈటీవీ 'ఓపెన్ సేల్' స్మార్ట్ ఫోన్ ప్రియులకు నిరాశ కలిగించింది. లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో గురువారం ఓపెన్ సేల్ కు పెట్టింది. హైఎండ్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వినియోగదారులకు ఆశాభంగం ఎదురైంది. అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ అమ్ముడయ్యాయన్న మెసేజ్ దర్శనమివ్వడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులు అవాక్కయ్యారు. 'సోల్డ్ అవుట్' సందేశంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఫోన్లు అమ్ముతామో చెప్పకుండా తమను పూల్స్ చేసిందని వాపోయారు. మొదటి ఫ్లాష్ అమ్మకాల్లో 2.2 లక్షల ఫోన్లు విక్రయించడంతో ఓపెన్ సేల్ లో కనీసం 2 లక్షల ఫోన్లు అమ్మకానికి పెడుతుందని భావించారు. స్టాక్ లేనప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేశారని ఓ వినియోగదారుడు ప్రశ్నించాడు. ఎల్ఈటీవీ తమను డిసప్పాయింట్ చేసిందని పేర్కొన్నారు. ఫ్లిప్ కార్ట్ లో లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ బుక్ చేశాను కానీ 20 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయినట్టు కనబడింది. ఏం జరుగుతోంది, సేల్స్ సక్రమంగా లేవని మరో అభిమాని వాపోయాడు. స్టాక్ అయిపోయిందంటున్నారు, ఓపెన్ సేల్ కు అర్థముందా అని మరొకరు ప్రశ్నించారు. అయితే దీనిపై ఎల్ఈటీవీ నుంచి ఎటువంటి స్పందన లేదు. చైనా నుంచి స్టాక్ రావాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. కాగా, 16 నిమిషాల్లో 25వేల ఫోన్లు అమ్మినట్టు ప్రచారం జరుగుతోంది. లె 1ఎస్ స్టాక్ అయిపోయినా, లె మ్యాక్స్(ధర. రూ.32,999) మాత్రం లభ్యమవుతోంది.